Pensioners : పెన్షన్ తీసుకునే వాళ్ళకీ ఉద్యోగులకీ సూపర్ గుడ్ న్యూస్..!
Pensioners : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో డీఏను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. హోలీ సందర్భంగా కేంద్రం.. ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచేందుకు సన్నద్ధమవుతోంది. హోలీ నాడు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. నిజానికి.. డీఏ పెంపుపై చాలా రోజుల నుంచి ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్ వెలువడుతున్న విషయం తెలిసిందే.
అయితే.. మార్చి 1న కేంద్ర కేబినేట్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే డీఏ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. గత సంవత్సరం సెప్టెంబర్ లోనే డీఏ పెరిగింది. 34 శాతంగా ఉన్న డీఏ.. 38 శాతం అయింది. ఈసారి 3 శాతం పెరిగే అవకాశం ఉంది. అంటే.. 38 శాతం నుంచి 41 శాతం పెరిగే చాన్స్ ఉంది. డీఏతో పాటు డీఆర్ కూడా పెరిగే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు పెరగనున్నాయి. నిజానికి.. సంవత్సరానికి రెండు సార్లు డీఏ పెరుగుతుంది.
Pensioners : సంవత్సరానికి రెండు సార్లు పెరిగే డీఏ
జనవరి, జూన్ లో పెరగాలి. కానీ.. కొన్ని కారణాల వల్ల డీఏ పెంపు ఆలస్యం అవుతూ ఉంటుంది. తాజాగా జనవరిలో పెరగాల్సిన డీఏ పెంపు నిర్ణయం మార్చిలో హోలీ సందర్భంగా కేంద్రం తీసుకోనుంది. గత నెల నుంచి ఎప్పుడు డీఏ పెరుగుతుందా అని ఉద్యోగులు తెగ ఎదురు చూస్తున్నారు. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరుగుతోంది. త్వరలో ఎనిమిదో వేతన సంఘం కూడా వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ.. ఈసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఎనిమిదో వేతన సంఘం గురించి ఎలా ప్రస్తావనను కేంద్రం తీసుకురాలేదు.