కరోనా టైమ్‌లో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. అసలే కరోనాతో ప్రస్తుతం పనులు లేవు. త్వరలో లాక్ డౌన్ కూడా విధించడానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఈనేపథ్యంలో కరోనా వల్ల పస్తులు ఉండే పరిస్థితి వస్తోంది. కనీసం కూలీ పనులు కూడా దొరకక.. ప్రజలు ఇప్పటి నుంచే అల్లాడుతున్నారు. కరోనా రోజురోజుకూ విపరీతంగా వ్యాప్తి చెందుతుండటంతో ఏం చేయాలో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రజలకు కరోనా వేళ ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రేషన్ కార్డుదారులందరికీ మే, జూన్ నెలల్లో ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని అందిస్తామని ప్రకటించింది. అయితే… కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోల బియ్యంతో పాటు మరో 5 కిలోల బియ్యాన్ని కూడా ఉచితంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే… మొత్తం మీద తెలంగాణ ప్రజలకు మే, జూన్ మాసాలకు గాను రెగ్యులర్ గా ఇచ్చే బియ్యంతో పాటు మరో 10 కిలోల ఉచిత బియ్యం రానున్నాయి.
Ration Card : గతంలో లాక్ డౌన్ సమయంలోనూ ఉచితంగా బియ్యం అందజేత
గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణలో వరుసగా కొన్ని నెలల పాటు ఉచితంగా బియ్యాన్ని అందజేశాయి. అలాగే.. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో ప్రతి రేషన్ కార్డు దారునికి నెలకు 1500 రూపాయలు సరుకుల కోసం ఉచితంగా అందించింది. వరుసగా రెండు మూడు నెలలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు పనులు లేక సతమతమవడంతో… రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ప్రజలను ఆదుకుంది. గత సంవత్సరం లాగానే… ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఉచితంగా బియ్యాన్ని అందించనుంది.