Night Curfew : రాత్రి కర్ఫ్యూపై సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం?
Night Curfew : ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా వల్ల దేశమంతా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోకి కరోనా సెకండ్ వేవ్ వ్యాపించింది. దీంతో దేశం అంతా అల్లకల్లోలం అయింది. ప్రస్తుతం ఏ హాస్పిటల్ లో చూసినా కరోనా పేషెంట్లే. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఈనేపథ్యంలో కరోనాను కట్టడి చేయడం కోసం ప్రభుత్వాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆక్సిజన్, వెంటిలేటర్లు, బెడ్స్ కొరత లేకుండా చూసుకుంటున్నాయి. అలాగే వ్యాక్సిన్లను కూడా టైమ్ టు టైమ్ అందిస్తున్నాయి.

night curfew in telangana extended till may 8
అలాగే.. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మినీ లాక్ డౌన్ ను ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రాత్రి పూట కర్ఫ్యూ నడుస్తోంది. తెలంగాణలో కూడా ఇదివరకు రాత్రి కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చింది. అయితే రాత్రి కర్ఫ్యూ ఈనెల 30తో ముగియనుండగా… రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు నిర్ణయించింది.
Night Curfew : మే 1 నుంచి మే 8 వరకు రాత్రి కర్ఫ్యూ అమలులోకి
ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను మే 8న ఉదయం 5 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకోగా… ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే.. వందల సంఖ్యలో కరోనా పేషెంట్లు తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
అయితే.. కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగ్గా లేవని… హైకోర్టు కూడా మండిపడింది. కరోనా పరిస్థితులపై తాజాగా హైకోర్టులో విచారణ జరగగా…. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రి కర్ఫ్యూ తర్వాత కరోనా కట్టడికి సంబంధించిన చర్యలపై హైకోర్టుకు వెల్లడించకపోవడంపై కోర్టు సీరియస్ కావడంతో ప్రభుత్వం వెంటనే కర్ఫ్యూని మరో వారం రోజులు పెంచుతున్నట్టు ప్రకటించింది.

night curfew in telangana extended till may 8