Exit Polls : నాగార్జున సాగర్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్? గెలుపు ఎవరిదో తెలిసిపోయింది?
Sagar by poll Exit Polls : తెలంగాణలో ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితాల గురించే ఎక్కడ చూసినా చర్చ సాగుతోంది. సాగర్ ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అనే దానిపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఎన్నికలు ముగిసి చాలారోజులు కావస్తున్నా… ఫలితాలు ఇంకా వెలువడలేదు. మే 2న, సాగర్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా… ప్రధానంగా పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యే ఉంది.
2018 లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య గెలిచారు. ఆయన చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఓడిపోయారు. ఆయన ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో… సాగర్ లో ఉపఎన్నికను నిర్వహించారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్లీ జానారెడ్డికే టికెట్ కేటాయించడంతో ఎన్నికలు బాగా వేడెక్కాయి. నిజానికి నాగార్జున సాగర్.. జానారెడ్డి కంచుకోట. చాలా ఏళ్ల నుంచి అక్కడ జానారెడ్డి గెలుచుకుంటూ వస్తున్నారు. 2018లో మాత్రం జానారెడ్డి కంచుకోటను టీఆర్ఎస్ పార్టీ బద్దలు కొట్టింది.
నోముల మరణంతో… టీఆర్ఎస్ పార్టీ… సాగర్ టికెట్ ను ఆయన కొడుకు నోముల భగత్ కు ఇచ్చింది. దీంతో సాగర్ ఉపఎన్నిక కేవలం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరుగా సాగింది. ఎన్నికల ప్రచారంలోనూ అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేసినప్పటికీ.. ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై స్పష్టత రాలేదు. తాజాగా సాగర్ ఉపఎన్నికు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీ గెలుస్తుందో స్పష్టంగా చెప్పారు.
Sagar by poll Exit Polls : సాగర్ ఉపఎన్నికపై మూడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఇవే
నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సంబంధించి మిషన్ చాణక్య అనే సర్వే సంస్థ సర్వే నిర్వహించగా… దాంట్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని తేలింది. టీఆర్ఎస్ పార్టీకి 49.254 శాతం ఓట్లు పోలవ్వగా… కాంగ్రెస్ పార్టీకి 37.92 శాతం ఓట్లు పోలవుతాయని వెల్లడించింది. బీజేపీకి 7.80 శాతం, ఇతర పార్టీలకు 5.04 శాతం ఓట్లు నమోదయ్యాయి. అంటే.. ఓట్ల పరంగా తీసుకుంటే.. టీఆర్ఎస్ పార్టీకి 93,450 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 71,964 ఓట్లు, బీజేపీకి 14,806 ఓట్లు, ఇతరులకు 9561 ఓట్లు పోలయ్యాయి.
Sagar by poll Exit Polls : ఆత్మ సాక్షి, ఆరా ఎగ్జిట్ పోల్స్ లోనూ టీఆర్ఎస్ పార్టీ ముందంజ
ఆత్మ సాక్షి అనే సర్వే సంస్థ ప్రకారం కూడా టీఆర్ఎస్ పార్టీనే ముందంజలో ఉంది. టీఆర్ఎస్ పార్టీకి 43.5 శాతం ఓట్లు రాగా… కాంగ్రెస్ పార్టీకి 39.5 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. బీజేపీకి 14.6 శాతం, ఇతరులకు 2.4 శాతం ఓట్లు నమోదయ్యాయి. అలాగే… ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 50.48 శాతం ఓటు షేర్, కాంగ్రెస్ కు 39.93 శాతం, బీజేపీకి 6.31 శాతం, ఇతరులకు 3.28 శాతం ఓట్లు నమోదు అయ్యాయి.