Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 150 ఉద్యోగాలకు డీఆర్‌డీఓ నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
Good News : నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, తెలంగాణలోని హైదరాబాద్ లోని డీఆర్ డీఓ సంస్థ 150 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఈ జాబ్ కు విద్యార్హతలు, ఇతర వివరాలకు నోటిఫికేషన్ కంప్లీట్ గా చదవండి..హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులను డీఆర్ డీఓ సంస్థ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. మొత్తం 150 ఖాళీలు ఉండగా, ఇవి అన్నీ కూడా అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది.ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈ నెల 7 చివరి తేదీ. కాగా, ఇతర పూర్తి వివరాలను మీరు నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు విధానం, విద్యార్హతలను కూడా నోటిఫికేషన్ లో పొందుపరిచారు. మొత్తం 150 ఖాళీల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు 40 ఉన్నాయి. ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానికల్, కెమికల్ సబ్జెక్ట్‌లో బీఈ లేదా బీటెక్, బీకామ్, బీఎస్‌సీ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి. సెలక్ట్ అయిన వారికి నెలకు రూ.9 వేల వేతనం ఇస్తారు. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టులు 60 ఉన్నాయి.
Good News : మరో రెండు రోజులే గడువు..
ఈ పోస్టులకుగాను ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానికల్, కెమికల్ సబ్జెక్ట్‌లో డిప్లొమా పాస్ కావాలి. ఈ పోస్టులకు కూడా ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి. ఈ పోస్టుకు సెలక్ట్ అయిన వారికి నెలకు రూ.8 వేల వేతనం ఇస్తారు. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు 50 ఉన్నాయి. ఇందులో ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్స్‌లో ఐటీఐ పాస్ కావాలి. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు. మొత్తం అన్ని పోస్టులకూ రిటెన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఉంటుంది.