Rythu Bandhu : రైతుల ఖాతాలలో డబ్బులు వేసిన ప్రభుత్వం..!!
Rythu Bandhu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2018 వ సంవత్సరంలో రైతుబంధు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటానికి ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహాలు కల్పించే రీతిలో.. టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.
దీనిలో భాగంగా తాజాగా పదో విడతరైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. యాసంగి పంట కోసం 21 లక్షలకు పైగా రైతుల ఖాతాలలో ₹607.32 కోట్లు జమ చేసింది. తొలుత ఎకరం భూమన్న రైతుల ఖాతాలో ఐదు వేల రూపాయలు చొప్పున డిపాజిట్ చేసింది. ఆ తర్వాత రేపటినుండి రెండు ఎల్లుండి మూడు ఎకరాల లోపు ఉన్న కర్షకుల ఎకౌంటులలో డబ్బులు చేయనుంది. ఇలా రోజు ఎకరా విస్తీర్ణం పెంచుతూ
నగదు డిపాజిట్ చేస్తూ మొత్తం..1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. ప్రతి సంక్రాంతి పండుగకు ముందు ఈ రీతిగా రైతుబంధు ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కేసిఆర్ ప్రభుత్వం మేలు చేస్తూ ఉంది. కొద్ది నెలల క్రితమే రైతుబంధు పదవ విడత విడుదలకు సంబంధించి సీఎం కేసీఆర్.. మంత్రి హరీష్ రావు కి తెలియజేశారు. అయితే ఈరోజు నుండి పదవ విడత రైతుబంధు నిధులు రైతుల ఖాతాలో పడనున్నాయి.