Diabetes : డయాబెటిస్ దాన్నే షుగర్ అంటాం మనం. కొందరు మధుమేహం అని కూడా అంటారు. పేరు ఏదైనా.. మధుమేహం వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. షుగర్ వ్యాధి వస్తే ఇక జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే. అలాగే.. షుగర్ రాకముందు జీవన విధానం ఎలా ఉన్నా.. షుగర్ వచ్చాక మాత్రం జీవన విధానం మొత్తం మారిపోతుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఒకటికి రెండుసార్లు ఏదైనా తినేముందు ఆలోచించాల్సి ఉంటుంది. ఇలా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. బతకాల్సి ఉంటుంది.
అందుకే.. షుగర్ వ్యాధి అంటేనే చాలామంది భయపడిపోతున్నారు. షుగర్ వ్యాధి ప్రస్తుతం అందరినీ భయపెడుతోంది. చిన్న వయసు.. పెద్ద వయసు అనే తేడా లేకుండా అందరితో ఆటలాడుకుంటోంది. అయితే.. డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచేందుకు.. ఆయుర్వేదంలో చాలా మందులు ఉన్నాయి. చాలామంది ఆయుర్వేద మందును ఉపయోగించి డయాబెటిస్ ను అదుపులో ఉంచుకున్నారు. అటువంటి గొప్ప మందే గ్రీన్ జాక్ ఫ్రూట్ పౌడర్. దీన్నే మనం పనస కాయ పొడి అంటాం.
పనస కాయ తెలుసు కదా. పనస కాయను చాలా మంది ఎంతో ఇష్టంతో తింటారు. నిజానికి పనసకాయలో చాలా సుగుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే.. ఇది రక్తంలోని షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. పనస కాయ పౌడర్.. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లలో గ్లైసెమిక్ నునియంత్రిస్తుంది. తద్వారా షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
పనస కాయ పౌడర్ అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ దొరుకుతుంది. ఆన్ లైన్ లోనూ దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. పసన పొడిని రోజూ 30 గ్రాముల పౌడర్ ను తీసుకోవాలి. పనస కాయ పొడిని నీళ్లలో కలుపుకొని కూడా తాగొచ్చు. ఇలా నిత్యం చేయడం వల్ల.. రక్తంలో షుగర్ లేవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే.. ఒబెసిటీతో బాధపడేవాళ్లు కూడా ఈ పౌడర్ ను తీసుకోవచ్చు. శరీరంలోని చెడు కొలెస్టరాల్ ను ఇది తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది హైబీపీని తగ్గిస్తుంది. ఇందులో క్యాన్సర్ కణాలను నాశనం చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
పనస పొడిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల.. రక్త హీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ పొడిని కూరల్లో వేసుకొని కూడా తినొచ్చు. టిఫిన్స్ తయారు చేసేటప్పుడు కూడా కొద్దిగా ఈ పౌడర్ ను కలిపేయండి. ఈ పొడిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఇది కూడా చదవండి ==> కోతుల నుంచి మనుషులకు సోకుతున్న కొత్త వైరస్.. ఇది కరోనా కన్నా డేంజర్?
ఇది కూడా చదవండి ==> నెయ్యి గురించి ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.. నెయ్యి తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే?
ఇది కూడా చదవండి ==> మీ ఇంట్లోనే యాపిల్ చెట్టును పెంచుకోవచ్చు.. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..!
ఇది కూడా చదవండి ==> గోధుమ గడ్డి జ్యూస్ ఎప్పుడైనా తాగారా? చాలా అనారోగ్య సమస్యలు నయం అవుతాయి..!
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.