Monkey B Virus : కోతుల నుంచి మనుషులకు సోకుతున్న కొత్త వైరస్.. ఇది కరోనా కన్నా డేంజర్?
Monkey B Virus : మంకీ బీ వైరస్.. ఇది ఒక వైరస్ పేరు. ఇది కోతుల నుంచి మనుషులకు సోకుతుంది. ఇది కరోనా కన్నా కూడా డేంజర్ వైరస్ అట. ఈ వైరస్ ముందు చైనాలో వెలుగుచూసింది. చైనాలోని బీజింగ్ లో ఓ పశు వైద్యుడికి ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ సోకి ఆ వైద్యుడు మరణించాడు. గత ఏప్రిల్ నెలలోనే ఆ వైద్యుడికి మంకీ బీ వైరస్ లక్షణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
ఈ వైరస్ సోకితే.. వికారం రావడం, వాంతులు రావడం జరుగుతుందని అంటున్నారు. ఏప్రిల్ లో ఆయనకు ఈ వ్యాధి సోకగా… మేలో ఆయన మరణించాడు. అయితే.. ఈ వ్యాధి 1932 లోనే మొదటిసారి వచ్చిందట. 2020 లోనూ ఈ వ్యాధి వచ్చింది. 2020 లో ఈ వైరస్ వచ్చినప్పుడు 21 మంది మరణించారు.
Monkey B Virus : అసలేంటి ఈ వైరస్? ఎందుకొస్తోంది?
కోతుల నుంచి ముందుగా ఈ వైరస్.. మనుషులకు సోకుతుంది. మకాక్ జాతికి చెందిన కోతుల నుంచి ఈ వైరస్ సోకుతోంది. మకాక్ జాతికి చెందిన కోతుల లాలాజలం, యూరిన్, మలంలో ఈ వైరస్ ఉంటుంది. వాటి ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. కోతులతో డైరెక్ట్ కాంటాక్ట్ అయినా కూడా ఈ వైరస్ సోకుతుందట. ఈ వైరస్ సోకితే మరణించే ప్రమాదం 70 నుంచి 80 శాతం వరకు ఉంటుందట.
అయితే.. ఈ వైరస్ తో ఇన్ఫెక్షన్ అయితే కోతి.. మనిషిని కరిచినప్పుడు లేదా అది తన గోళ్లతో గీరినప్పుడు అది కోతుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన నెల రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, వికారంతో పాటు.. తీవ్రంగా జ్వరం, తలనొప్పి రావడం, నీరసం రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ కు ప్రస్తుతం ఎటువంటి చికిత్స లేదు. ఈ వైరస్ నెమ్మదిగా బ్రెయిన్ ను ఎఫెక్ట్ చేస్తుంది. బ్రెయిన్ ను డ్యామేజ్ చేయడంతో పాటు నర్వస్ సిస్టమ్ ను కూడా డ్యామేజ్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిని.. మనిషి చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
ఇది కూడా చదవండి ==> షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? ఈ టీని నిత్యం తీసుకోండి.. షుగర్ ను తగ్గించుకోండి..!
ఇది కూడా చదవండి ==> ఏ రాశి వారు ఏ యోగాసనం వేస్తే మంచిదో తెలుసా?
ఇది కూడా చదవండి ==> ఉల్లిపాయ రసం అమృతం లాంటిది.. నిత్యం దీన్ని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
ఇది కూడా చదవండి ==> డయాబెటిస్ ఉన్న వారికి గుడ్ న్యూస్ …లాలాజలంతో షుగర్ పరీక్ష ?