Wheat Grass Juice : గోధుమ గడ్డి జ్యూస్ ఎప్పుడైనా తాగారా? చాలా అనారోగ్య సమస్యలు నయం అవుతాయి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Wheat Grass Juice : గోధుమ గడ్డి జ్యూస్ ఎప్పుడైనా తాగారా? చాలా అనారోగ్య సమస్యలు నయం అవుతాయి..!

Wheat Grass Juice : గోధుమలు తెలుసు కదా. గోధుమ పిండితో చాలామంది పలు రకాల వంటకాలను చేస్తారు. ముఖ్యంగా చపాతీలు, రోటీలు.. పూరీలు.. ఇలా పలు రకాల వంటకాలను చేసుకుంటాం. గోధుమల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి.. అనే విషయాలను పక్కన పెడితే.. గోధుమ గడ్డి వల్ల మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు షాక్ అవడం ఖాయం. అసలు.. చాలామందికి గోధుమ గడ్డి అనగానే నవ్వొస్తుంది. గోధుమ గడ్డిని తినాలా? […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 July 2021,10:18 pm

Wheat Grass Juice : గోధుమలు తెలుసు కదా. గోధుమ పిండితో చాలామంది పలు రకాల వంటకాలను చేస్తారు. ముఖ్యంగా చపాతీలు, రోటీలు.. పూరీలు.. ఇలా పలు రకాల వంటకాలను చేసుకుంటాం. గోధుమల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి.. అనే విషయాలను పక్కన పెడితే.. గోధుమ గడ్డి వల్ల మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు షాక్ అవడం ఖాయం. అసలు.. చాలామందికి గోధుమ గడ్డి అనగానే నవ్వొస్తుంది. గోధుమ గడ్డిని తినాలా? వాటిని పశువులు తింటాయి కానీ.. మనుషులు తింటారా? అని ఆశ్చర్యపోవచ్చు. కానీ.. గోధుమ గడ్డి వల్ల చాలా లాభాలు ఉంటాయి. గోధుమ గడ్డితో జ్యూస్ చేసుకొని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా వెంటనే గోధుమ గడ్డి జ్యూస్ ను తాగేస్తారు.

wheat grass juice health benefits telugu

wheat grass juice health benefits telugu

అయితే.. గోధుమ గడ్డి జ్యూస్ అంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ లభించదు. చాలామంది గోధుమ గడ్డి జ్యూస్ ను వాడేవాళ్లు.. తమ ఇంట్లోనే గోధుమ గడ్డిని పెంచుకొని.. దాని నుంచి వచ్చే జ్యూస్ ను తాగి అనారోగ్య సమస్యలను నయం చేసుకుంటున్నారు. కొందరికి అసలు.. గోధుమ గడ్డిని ఎలా పెంచాలో తెలియదు. గోధుమ గడ్డి పెంచలేని వాళ్లు.. గోధుమ గడ్డి ట్యాబ్లెట్లు ఆయుర్వేద షాపుల్లో లభిస్తాయి. గోధుమ గడ్డి జ్యూస్ కూడా ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది.

Wheat Grass Juice : గోధుమ గడ్డిని ఎలా పండించాలంటే?

గోధుమ గడ్డిని చాలా ఈజీగా పండించవచ్చు. ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటే చాలు. లేదా పేరట్లో ప్లేస్ ఉన్నా.. గోధుమ గడ్డిని పెంచొచ్చు. ముందు.. గోధుమలను తీసుకొని వాటిని మొలకెత్తేలా చేయాలి. అవి మొలకెత్తాక వాటిని నేలలో నాటాలి. ఒక వారం రోజుల్లో గోధుమ గడ్డి మొలుస్తుంది. గడ్డి లేతగా ఉండగానే.. ఆ గడ్డిని కోసి.. జ్యూస్ లా చేసుకోవాలి. అలా.. గడ్డి పెరుగుతున్నా కొద్దీ.. గడ్డిని తెంపుకొని జ్యూస్ చేసుకొని నిత్యం తాగుతూ ఉండాలి.

wheat grass juice health benefits telugu

wheat grass juice health benefits telugu

Wheat Grass Juice : గోధుమ గడ్డి జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

గోధుమ గడ్డి యూస్ లో విటమిన్ ఏ, సీ, ఈ, కే, బీ కాంప్లెక్స్ తో పాటు.. మినరల్స్ అయిన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. పుష్కలంగా ప్రొటీన్లు ఉంటాయి. ఒక్క గ్లాస్ గోధుమ గడ్డి జ్యూస్ తాగితే ఇన్ని లాభాలు కలుగుతాయి. అలాగే.. గోధుమ గడ్డి జ్యూస్ శరీరంలో ఉన్న విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేస్తుంది. దాని వల్ల.. చాలా సమస్యలు తగ్గుతాయి. అలాగే.. శరీరంలో ఏర్పడే పలు ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు.

wheat grass juice health benefits telugu

wheat grass juice health benefits telugu

మనం తినే ఆహారం ఏదైనా అరగాలంటే.. జీర్ణం అవ్వాలంటే.. ఖచ్చితంగా కొన్ని ఎంజైమ్ లు రిలీజ్ అవ్వాలి. అప్పుడే తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. ఒకవేళ సరిగ్గా ఎంజైమ్ లు రిలీజ్ కాకపోతే.. అజీర్తి సమస్య వస్తుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగితే.. తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు కావాల్సిన ఎంజైమ్ లు అన్నీ తయారవుతాయి. అలాగే.. తిన్న ఆహారంలోని పోషకాలను కూడా శరీరం గ్రహించగలుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణం అయితే.. మలబద్ధకం సమస్య రాదు.. జీర్ణ సమస్యలు రావు. గ్యాస్ సమస్యలు కూడా అస్సలు రావు.

గోధుమ గడ్డి జ్యూస్ శరీరంలోని మెటబాలిజం రేటును పెంచుతుంది. చెడు కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. హైబీపీ ఉంటే కంట్రోల్ చేస్తుంది. రక్తంలో ఎర్రరక్త కణాలను పెంచుతుంది. రక్తహీనత సమస్య కూడా రాకుండా కాపాడుతుంది. షుగర్ సమస్య ఉన్నవాళ్లకు ఈ జ్యూస్ దివ్యౌషధం అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ జ్యూస్.. షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.

అయితే.. గోధుమ గడ్డి జ్యూస్ ను రోజూ 30 మిల్లీలీటర్ల మోతాదు వరకు తీసుకోవచ్చు. నిత్యం గోధుమ గడ్డి జ్యూస్ ను తీసుకుంటే.. పైన చెప్పుకున్న అన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కాకపోతే గర్భిణీలు, చిన్నపిల్లలు, పాలిచ్చే తల్లులు మాత్రం ఈ జ్యూస్ కు దూరంగా ఉండటం బెటర్.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఉల్లిపాయ రసం అమృతం లాంటిది.. నిత్యం దీన్ని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> పంటినొప్పి తీవ్రంగా వేధిస్తోందా? ఈ వంటింటి చిట్కాలతో పంటినొప్పిని తగ్గించుకోండిలా..!

ఇది కూడా చ‌ద‌వండి ==> డ‌యాబెటిస్ ఉన్న వారికి  గుడ్ న్యూస్ …లాలాజ‌లంతో షుగ‌ర్ ప‌రీక్ష ?

ఇది కూడా చ‌ద‌వండి ==> టమాటాలు తింటే క్యాన్సర్ రాదా? నిపుణులు ఏమంటున్నారు?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది