Ghee : నెయ్యి గురించి ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.. నెయ్యి తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే?
Ghee : ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్లు చాలామంది నెయ్యి అంటేనే భయపడతారు. వామ్మో.. నెయ్యి వద్దు బాబోయ్.. అది తింటే లావెక్కిపోతాం అని అంటారు. అందుకే.. నెయ్యిని పక్కన పెడతారు. నిజానికి.. నెయ్యిని చూడగానే మనకు నోరూరుతుంది. ప్రతి వంటకంలోనూ నెయ్యిని వాడొచ్చు. నెయ్యితో చేసిన వంటకాల టేస్టే వేరు. కానీ.. లావెక్కుతామనే భయంతో చాలామంది నెయ్యిని పక్కన పెట్టేస్తుంటారు. నెయ్యి తింటే ఆరోగ్యానికి హానికరం, అది తింటే బరువు పెరుగుతారు.. కొలెస్టరాల్ పెరుగుతుంది.. అని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ.. నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారు.. అని అనడానికి ఆధారాలు అయితే లేవు.
అవును.. నెయ్యి తినడం వల్ల.. బరువు పెరుగుతారు.. అనారోగ్యం.. కొవ్వు పెరుగుతుంది అని అనడం పూర్తిగా అపోహ మాత్రమే. అది నిజం కాదు. మీకో విషయం తెలుసా? నాణ్యమైన ఆవు నెయ్యిని తింటే అస్సలు బరువు పెరగరు. బరువు తగ్గుతారు. నమ్మడం లేదు కదా. నెయ్యి గురించి అసలు విషయాలు తెలుసుకుందాం రండి.
Ghee : నెయ్యి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
అసలు నెయ్యిలో లాక్టోజే ఉండదు. నెయ్యి త్వరగా జీర్ణం అవుతుంది కూడా. నెయ్యిని నిత్యం తీసుకోవడం వల్ల.. బరువు తగ్గుతారు. ముఖ్యంగా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు వెంటనే కరుగుతుంది. కాకపోతే.. నెయ్యిని నిత్యం మోతాదులో తీసుకోవాలి. నెయ్యిలో ఉండే అమైనో యాసిడ్స్.. కొవ్వు కణాలను కరిగిస్తాయి. దీని వల్ల బరువు తగ్గుతారు. నెయ్యిలో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్, లినోలీయిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి.
జీర్ణ శక్తి పెరగాలన్నా.. కొవ్వు కణాలను కరిగించాలన్నా.. బరువు తగ్గాలన్నా కచ్చితంగా నెయ్యిని తినాల్సిందే. ఇది చెడు కొలెస్టరాల్ ను తగ్గించి.. మంచి కొలెస్టరాల్ ను పెరిగేలా చేస్తుంది. దాని వల్ల.. బరువు తగ్గుతారు. చూశారు కదా.. నెయ్యి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అందుకే.. ఇక నుంచి నిరభ్యంతరంగా రోజూ 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. అధికంగా మాత్రం తీసుకోకండి.
ఇది కూడా చదవండి ==> షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? ఈ టీని నిత్యం తీసుకోండి.. షుగర్ ను తగ్గించుకోండి..!
ఇది కూడా చదవండి ==> ఏ రాశి వారు ఏ యోగాసనం వేస్తే మంచిదో తెలుసా?
ఇది కూడా చదవండి ==> ఉల్లిపాయ రసం అమృతం లాంటిది.. నిత్యం దీన్ని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
ఇది కూడా చదవండి ==> డయాబెటిస్ ఉన్న వారికి గుడ్ న్యూస్ …లాలాజలంతో షుగర్ పరీక్ష ?