Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుండి తప్పుకున్న హార్ధిక్ పాండ్యా..!
Hardik Pandya : ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మెరుగ్గానే రాణించిన ఫైనల్ వరకు చేరుకోలేకపోయింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.ఈ ఓటమితో ముంబై జట్టు మొత్తం తీవ్ర నిరాశకు గురైంది. ముంబై జట్టు యాజమాన్యంతో పాటు సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్లంతా నిరాశలో కూరుకుపోయారు.

Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుండి తప్పుకున్న హార్ధిక్ పాండ్యా..!
Hardik Pandya ఊహించని నిర్ణయం..
ఓటమి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి రాజీనామా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. కానీ ఇది ఒక వార్త మాత్రమే, దీనిపై అధికారనిక ప్రకటన లేదు. ఈ వార్తలు వస్తున్న క్రమంలో తదుపరి ముంబై కెప్టెన్ ఎవరు అని నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44)లతో పాటు నమన్ ధీర్(18 బంతుల్లో 7 ఫోర్లతో 37) రాణించారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్‌తో పాటు నెహాల్ వధేరా(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), జోష్ ఇంగ్లీస్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించారు.