Harish Rao : మంత్రి హరీష్ రావు ముందే మల్లారెడ్డి ఇమిటేట్ చేసిన కాలేజీ కుర్రోడు వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Harish Rao : మంత్రి హరీష్ రావు ముందే మల్లారెడ్డి ఇమిటేట్ చేసిన కాలేజీ కుర్రోడు వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :7 March 2023,4:00 pm

Harish Rao : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశలలో ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన స్పీచ్ సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూ ఉంది. తాను కష్టపడి పాలమ్మి, పూలమ్మి ఇలా చెబుతూ పైకొచ్చినట్లు తెలియజేశారు. అయితే ప్రధాని టీ అమీ దేశంలో… ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారా దత్తం చేస్తున్నారని అమ్మేస్తున్నారని సెటైర్లు వేయడం జరిగింది. మల్లారెడ్డి స్పీచ్ తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో చాలా సంచలనం సృష్టించింది.

Harish Rao Funny Comments On Malla Reddy

Harish Rao Funny Comments On Malla Reddy

ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొత్త భవనాన్ని హరీష్ రావు ప్రారంభించడం జరిగింది. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా వారి లక్ష్యాలు మరియు ఇష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి తనకు… మంత్రి మల్లారెడ్డి అంటే ఇష్టం ఆయన అభిమానిని అని తెలియజేశాడు.

సోషల్ మీడియాలో మల్లన్న మస్తు ట్రెండింగ్.. | Harish Rao shocked Malla Reddy  Following | hmtv - YouTube

అంతేకాదు మంత్రి హరీష్ రావు మరికొంతమంది ప్రజాప్రతినిధులు అక్కడ ఉండగానే ఆయనను సదరు విద్యార్థి ఇమిటెడ్ చేయడం జరిగింది. అయితే మీ ఫేవరేట్ మంత్రి మల్లారెడ్డి స్పీచ్ చెప్పు అని సదరు స్టూడెంట్ ని హరీష్ రావు అడిగారు. దీంతో సదరు విద్యార్ధి కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా.. డైలాగ్‌ను చెప్పడంతో సభలో ఒక్కసారిగా అందరూ పగలబడి నవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతూ ఉంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది