హరీష్ రావు కే టీఆర్‌ఎస్ పగ్గాలు?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

హరీష్ రావు కే టీఆర్‌ఎస్ పగ్గాలు??

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 December 2020,2:00 pm

ఒకప్పటి టీఆర్ఎస్ వేరు. ఇప్పటి టీఆర్ఎస్ వేరు. తెలంగాణ వచ్చే వరకు.. తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే.. తెలంగాణ బాగుపడుతుంది అని అంతా అనుకున్నారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సీఎం కేసీఆర్ లేకున్నా సరే.. టీఆర్ఎస్ పార్టీ లేకున్నా సరే.. తెలంగాణకు ఏం కాదు. తెలంగాణ సుభిక్షంగానే ఉంటుంది.. అనే పరిస్థితులు వచ్చాయి. దాని ఫలితమే దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు.

harish rao to hand over trs party as president

harish rao to hand over trs party as president

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు.. అనే మాట చాలా ఏళ్ల పాట విన్నాం. కాంగ్రెస్ అసలు టీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. టీడీపీ నామరూం లేకుండా పోయింది. దీంతో.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి దీటుగా మరో పార్టీ రావడం కష్టమే అని అంతా భావించారు. కానీ.. బీజేపీ వాటన్నింటికీ చెక్ పెట్టి.. తెలంగాణలో బీజేపీ దూకుడు మీద ఉన్నది. మామూలు దూకుడు కాదు.. ఒక రేంజ్ లో బీజేపీ దూసుకుపోతోంది.

దీంతో టీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడటం లేదు. దానితో పాటు.. దుబ్బాక ఉపఎన్నిక ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు రావడంతో వెంటనే సీఎం కేసీఆర్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. పార్టీలో చాలా మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

కేటీఆర్ సీఎం, హరీశ్ రావు పార్టీ అధ్యక్షుడు

చాలా కీలకమైన మార్పులు చేసి… 2023 ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారట. దాని ముఖ్యమైన మార్పు.. హరీశ్ రావుకే పార్టీ పగ్గాలను అప్పగించడం. హరీశ్ రావుకు పార్టీ పగ్గాలను అప్పగించేసి.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం. ఈ రెండు మార్పులు చేసి.. తను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం.

అయితే.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం అనేది అందరికీ తెలిసిందే. కానీ.. పార్టీ పగ్గాలను హరీశ్ రావుకు అప్పగిస్తారు కేసీఆర్.. అనే విషయం మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే.. హరీశ్ రావుకు బయట ఉన్న ఫాలోయింగ్ అటువంటిది. ఒక్క సిద్ధిపేటలోనే కాదు.. యావత్ తెలంగాణ మొత్తం.. హరీశ్ రావు వెంట ఉంది. హరీశ్ రావుకు ప్రస్తుతం ఉన్న ఇమేజ్ ను దృష్టిల్ పెట్టుకొని.. కేటీఆర్ ను సీఎం చేస్తే.. హరీశ్ రావు అభిమానులు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి.. హరీశ్ రావుకు పార్టీ పగ్గాలను అప్పజెప్పాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారట.

నిజానికి.. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాతనే కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించాల్సి ఉంది. కానీ.. గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఆ కార్యక్రమాన్ని కేసీఆర్ వాయిదా వేశారు. కానీ.. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలంటే.. ఇప్పటినుంచే పార్టీలో కీలకమైన మార్పులు చేయాలని.. కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే.. హరీశ్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించి.. హరీశ్ రావకు కీలక శాఖలను కూడా ఇచ్చి.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించే బాధ్యతను కేసీఆర్.. హరీశ్ రావుకు అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇది నిజమా? అబద్ధమా? అనే విషయం తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది