Head Constable : ఏపీ ప్రభుత్వంలో పని చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నా.. హెడ్ కానిస్టేబుల్ ఆవేదన.. వీడియో
Head Constable : ఏపీ రాజకీయాల్లో తాజాగా జరిగిన ఘటనలు అందరికీ తెలుసు. నిండు సభలో తనను అవమానించారని, తాను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడుతానంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలోనే తన భార్యపైన దుష్ప్రచారం చేశారని మీడియా సాక్షిగా చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, ఈ ఘటనలపై ఓ హెడ్ కానిస్టేబుల్ ఆవేదనం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Head Constable : ఆయన హయాంలోనే తనకు ఉద్యోగమొచ్చిందన్న కానిస్టేబుల్..
సదరు వీడియోలో హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ..తనకు 1998లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందని, అప్పుడు ఉమ్మడి ఏపీకి చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని గుర్తుచేశాడు. తాను ఆ నాటి నుంచి సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూ నీతి, నిజాయితీగా ముందుకు సాగానని చెప్పాడు.

z head constable
ఏ రోజు చేయి చాచి లంచం అడగలేదని, అవినీతికి తావు లేకుండా సిన్సియర్‌గా జాబ్ చేశానని అన్నాడు. కాగా, ఏపీ అసెంబ్లీలో హృదయ విదారక ఘటన జరిగిందని, గద్గద స్వరంతో హెడ్ కానిస్టేబుల్ మాట్లాడాడు. నైతిక విలువలు, నిబద్ధత కోల్పోయి వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వంలో పని చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నాడు. వీడియోలో మాట్లాడుతున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ భావోద్వేగానికి గురయ్యాడు.
వీడియో : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంఘటనల పై ఒక హెడ్ కానిస్టేబుల్ ఆవేదన #APAssembly pic.twitter.com/DImutGGZx0
— Telugu360 (@Telugu360) November 20, 2021