Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు కూడా ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు కలిగిస్తాయి. చాలామంది వంట సమయంలో వెల్లుల్లి తొక్కలను తీసేసి వేసేస్తుంటారు. కానీ తాజా పరిశోధనలు, ఆయుర్వేద నిపుణుల అభిప్రాయాల ప్రకారం వెల్లుల్లి తొక్కలు యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలతో నిండి ఉన్నాయి.

#image_title
1. ఆస్తమాకు ఉపశమనం కలిగిస్తుంది
వెల్లుల్లి తొక్కల్లోని సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.
2. చర్మ సమస్యల నివారణకు ఉపయుక్తం
తామర, దురద, అలర్జీ వంటి చర్మ సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లి తొక్కలను ఉపయోగించవచ్చు. కొన్ని గంటలు నీటిలో నానబెట్టిన వెల్లుల్లి తొక్కల నీటితో చర్మాన్ని శుభ్రం చేయడం వల్ల, బాక్టీరియా, ఫంగస్ వల్ల వచ్చే దురద, ఇన్‌ఫెక్షన్లకు ఉపశమనం లభిస్తుంది.
3. పాదాల వాపు, నొప్పుల నుండి ఉపశమనం
వాపు, నొప్పి వంటి సమస్యలు ఉన్నప్పుడు వెల్లుల్లి తొక్కలను నీటిలో మరిగించి, ఆ గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల ఉబ్బసం తగ్గుతుంది, కాళ్లలో రిలీఫ్ వస్తుంది.
4. జుట్టు ఆరోగ్యానికి మంచిది
జుట్టులో చుండ్రు, దురద, జుట్టు రాలే సమస్యలు ఉన్నవారు కూడా వెల్లుల్లి తొక్కల నీటిని లేదా పేస్ట్‌ను తలకు అప్లై చేయవచ్చు.
5. ఆహారంలో వాడకంతో పోషణ
వెల్లుల్లి తొక్కలు కేవలం ఔషధంగా కాకుండా వంటకాల్లోనూ వాడవచ్చు.