Rose Petals : గులాబీ రేకులతో అందం మాత్రమే కాదు… ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rose Petals : గులాబీ రేకులతో అందం మాత్రమే కాదు… ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండు…!

 Authored By ramu | The Telugu News | Updated on :15 August 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Rose Petals : గులాబీ రేకులతో అందం మాత్రమే కాదు... ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండు...!

గులాబీ పువ్వు అంటేనే అందం. ఎన్ని పూలు ఉన్నా గాని ఈ గులాబీ పూలకు వచ్చే ఎట్రాక్షన్ మాత్రం వేరే. అయితే ఈ గులాబీ పువ్వులు అంటే ఎంతో మందికి చాలా ఇష్టం. అలాగే ఈ గులాబీ పువ్వులలో ఎన్నో రకాలు కూడా ఉన్నాయి. కానీ అధికంగా ఎంతోమంది రెడ్ కలర్ పువ్వులు మరియు డార్క్ పింక్ కలర్ లో ఉండే పువ్వులనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో కూడా ఈ రెండు రంగులకు సంబంధించిన మొక్కలను ఎక్కువగా పెంచుతారు. ఈ గులాబీ పువ్వులు అనేవి కేవలం అందం మరియు ఆకర్షణకు మాత్రమే కాదు. ఈ పువ్వులో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల జబ్బులను నయం చేసేందుకు ఈ గులాబీ రేకులను వాడేవారు. అయితే ఈ గులాబీ రేకులతో ప్రయోజనాలతో పాటుగా ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అయితే దేశ వాలి గులాబీలు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఈ పూలతో ఉన్న ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…

Rose Petals ఫైల్స్ తో పోరాడుతుంది

ఫైల్స్ సమస్యతో బాధపడేవారు ఈ గులాబి రేకులతో సమస్యను నియంత్రించవచ్చు. ఈ గులాబీ రేకులలో ఉండే డిజెస్టివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది ఫైల్స్ సమస్యను నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే జీర్ణక్రియ కు కూడా సహాయపడతాయి. ఈ గులాబీ పువ్వులను తీసుకోవడం వలన పుండ్లు కూడా తొందరగా తగ్గుతాయి.

వెయిట్ లాస్ అవుతారు : ఎంతో మంది వెయిట్ లాస్ అవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వైట్ క్లాస్ అవ్వాలనుకునేవారు వారి డైట్లో గులాబీ రేకులను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీరు గులాబీ రేకులతో టీ చేసుకుని ప్రతిరోజు రెండు పూటలా తీసుకోండి. ఇలా టీ చేసుకుని తాగటం వలన జీర్ణక్రియ అనేది మెరుగుపడి తొందరగా బరువు తగ్గటానికి మేలు చేస్తుంది.

Rose Petals గులాబీ రేకులతో అందం మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండు

Rose Petals : గులాబీ రేకులతో అందం మాత్రమే కాదు… ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండు…!

చర్మ సమస్యలకు  ఈ గులాబీ రేకులను ఎక్కువగా చర్మ సమస్యలను నయం చేసేందుకు వాడతారు. వీటిని మార్కెట్లో దొరికే పలు రకాల ప్రొడక్ట్స్ లో కూడా వాడతారు. అయితే ఈ దేశ వాలీ గులాబీ రేకులను ప్రతినిత్యం కొన్ని నమిలి తీసుకోవడం వలన చర్మం అనేది ఎంతో యవ్వనంగా మరియు తాజాగా మెరుస్తుంది. అలాగే ముఖం పై డల్ నెస్ కూడా తొలగిపోతుంది. అలాగే ఈ గులాబీ రేకులను టీలాగా మరియు వంటకాలలో మరియు సలాడ్ లలో కూడా వాడవచ్చు.

బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ : ప్రతిరోజు ఈ గులాబీ రేకుల కషాయాన్ని చేసుకొని తాగడం వలన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. అలాగే మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది