Educated Beggar Story : ఎంఎస్సీ చదివి రోడ్డుపై అడుక్కుంటున్న బిచ్చగాడు.. ఇంట్లో వాళ్లే గెంటేశారు
Educated Beggar Story : ఎంఎస్సీ చదివిన వాళ్లు ఏం చేస్తారు చెప్పండి. ఏదైనా మంచి ఉద్యోగం చేసుకొని జీవనం సాగిస్తుంటారు అంటారు కదా. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఎంఎస్సీ చదివి ఉన్నత ఉద్యోగాలు చేసి చివరకు బిచ్చగాడిగా మారాడు. ఆయన పేరు దస్తగిరి. ఆయన వయసు 60 ఏళ్లకు పైనే ఉంటుంది. ఆయనకు రెండు ఇళ్లు ఉన్నాయి. అయినా కూడా ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీద జీవనం సాగిస్తున్నాడు.
కడపలో రోడ్డు మీద జీవనం సాగిస్తున్నాడు. తనకు అందరూ ఉన్నారు కానీ.. ఎవ్వరూ లేని అనాథ అయ్యాడు. ఉన్నత చదువులు చదివాడు. రెండు ఇండ్లు ఉన్నాయి కానీ.. అయిన వాళ్లే ఇంట్లో నుంచి గెంటేశారు. తల్లిదండ్రులు లేరు. సోదరులు, అక్కలు ఉన్నారు వాళ్లే అతడి ఇళ్లను లాక్కొని ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో రోడ్ల మీదే బతుకుతున్నాడు. మూడు పూటల తిండి కోసం చేతులు చాచి అడుక్కుంటున్నాడు.ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసి, వ్యాపారాలు కూడా చేసి తన ఫ్యామిలీని సాదాడు. కానీ.. తన డబ్బు అంతా లాక్కొని ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. పెళ్లి కూడా కాలేదు అందుకే రోడ్డు మీదికి వచ్చేశాడు దస్తగిరి.
Educated Beggar Story : ఆయనకు ఎందుకు అంత కష్టం వచ్చింది
పుట్టి పెరిగింది అంతా కడపలోనే. తన వాళ్లు కూడా కడపలోనే ఉంటారు కానీ.. తనను ఎవ్వరూ పట్టించుకోరు. దీంతో దిక్కుతోచని స్థితిలో దస్తగిరి రోడ్డు మీదనే బతుకుతున్నాడు. తన దగ్గర డబ్బులు లేవని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మృత్యుంజయ కుంటలో అన్నదమ్ములు ఉన్నారని చెబుతున్నాడు. ఆయన గురించి తెలుసుకొని స్థానికులు నివ్వెర పోతున్నారు.