World Richest Beggar : పేరుకి బిచ్చగాడు కాని ఖరీదైన ఫ్లాట్లు, ఆస్తులు..ఆ లెవలే వేరు
ప్రధానాంశాలు:
World Richest Beggar : పేరుకి బిచ్చగాడు కాని ఖరీదైన ఫ్లాట్లు, ఆస్తులు..ఆ లెవలే వేరు
World Richest Beggar : బిచ్చగాళ్లలో ఈ బిచ్చగాడు వేరయా అని చెప్పాలి. భరత్ జైన్ అనే బిచ్చగాడు ఏడాదికి రూ.7.5 కోట్లు సంపాదిస్తాడట. ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భరత్ జైన్ ప్రధానంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఆజాద్ మైదాన్ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ బహుళ ఆస్తులని కూడపెట్టుకున్నాడు.

World Richest Beggar : పేరుకి బిచ్చగాడు కాని ఖరీదైన ఫ్లాట్లు, ఆస్తులు..ఆ లెవలే వేరు
World Richest Beggar ధనవంతుడైన బిచ్చగాడు..
జైన్ ఒక పేద కుటుంబంలో జన్మించడంతో భిక్షాటన అతని జీవనోపాధిగా మారింది. దాదాపు 40 సంవత్సరాలుగా, అతను ఈ వృత్తిలో కొనసాగుతూ రోజుకు రూ.2,000 నుండి రూ.2,500 వరకు సంపాదిస్తున్నాడు. రోజుకు 10-12 గంటలు పని చేయడం ద్వారా నెలకు రూ.60,000 నుంచి రూ.75,000 వరకు ఆదాయం పొందుతున్నాడు. సంపాదించింది పెట్టుబడి పెట్టి తన కుటుంబం కోసం అనేక ఆస్తులను కొనుగోలు చేశాడు.
ప్రస్తుతం, అతని భార్య, ఇద్దరు కుమారులు, తండ్రి, సోదరుడు కలిసి రూ.1.4 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లలో నివసిస్తున్నారు. అంతేకాక, థానేలో అతనికి రెండు దుకాణాలు ఉన్నాయి, ఇవి ప్రతి నెలా రూ.30,000 అద్దె ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ, భరత్ జైన్ భిక్షాటన చేస్తూనే ఉన్నాడు. ఆలయాలు, దాతృత్వ సంస్థలకు విరాళాలు కూడా ఇస్తున్నాడు. భారతదేశంలో మరికొందరు ధనవంతులైన బిచ్చగాళ్లు చూస్తే.. లక్ష్మీ దాస్ (కోల్‌కతా) – నికర సంపద రూ.1 కోటి, కృష్ణ కుమార్ గీతే (నాలా సోపారా) – రూ.7 లక్షల విలువైన గదిలో నివసిస్తూ, సంపదను కూడబెట్టుకున్నాడు.