Beggar : బిచ్చగాడు మారువేషంలో వచ్చిన పిల్లాన్ని పట్టుకెళ్ళిపోయాడు.. తర్వాత శవమై తేలడు ఒళ్ళు గగూర్పొడిచే సంఘటన..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beggar : బిచ్చగాడు మారువేషంలో వచ్చిన పిల్లాన్ని పట్టుకెళ్ళిపోయాడు.. తర్వాత శవమై తేలడు ఒళ్ళు గగూర్పొడిచే సంఘటన..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :23 March 2023,9:00 am

Beggar : మహారాష్ట్రలో మంగేష్ అనే చిన్న కుర్రోడు కిడ్నాప్ కీ గురైనట్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదయింది. మంగేష్ పాటిల్ స్కూల్ నుండి సాయంత్రం ఇంటికి వచ్చి… ఊరి చివర ఉండే తాత ఇంటి వద్దకు వెళ్లడం జరిగింది. అక్కడ తాత ఐదు రూపాయలు ఇవ్వటంతో… తన తాతను భుజంపై చేయి వేసుకుని.. మంగేష్ మలవిసర్జనకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత కాసేపు అక్కడే టీవీ కూడా చూసుకోవడం జరిగింది. అక్కడ తనకు పెద్ద చాక్లెట్ కావాలని మంగేష్ మారం చేస్తే.. తాత పది రూపాయలు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి షాపు వద్దకు వెళ్లి ఫైవ్ స్టార్ చాక్లెట్ కొనుక్కున్నాడు. అదే చివరిసారి ఆ తర్వాత ఇంకా కుటుంబ సభ్యులకు మంగేష్ కనిపించలేదు.

దీంతో పోలీసులు మంగేష్ ప్రాంతం చుట్టుప్రక్కల అంతా కూడా గాలించారు. ఎక్కడ కూడా అతని ఆచూకీ దొరకలేదు. కానీ ఊరి చివర చెత్త పేరుకుపోవడంతో దాన్ని సర్పంచ్ కొడుకు శుభ్రం చేయిస్తూ ఉండగా చిన్నపిల్లోడి కాలు దొరికింది. అది కూడా కుక్క తింటూ ఉండటంతో గమనించి పోలీసుల సమాచారం అందించాడు. పోలీసులు పరిశీలించి చూడక వెంటనే మంగేష్ తల్లిదండ్రులను ఘటనా స్థలానికి తీసుకురాగా ఆ కాలు తమ పిల్లాడిదని పుట్టుమచ్చబట్టి గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు. మంగేష్ చనిపోయినట్లు తాతకి తెలియగానే అతడు కుప్ప కూలిపోయాడు. అయితే ఈ ఘటన సరిగా మౌని అమావాస్య టైంలో జరగడంతో ఇది క్షుద్ర

The beggar took the child in disguise

The beggar took the child in disguise

పూజలు ద్వారా జరిగినట్లు పోలీసులు అనుమానం. కాలుతూ పసుపు కుంకుమ ఉండటంతో పోలీసులు.. క్షుద్ర పూజలు చేసే వారి లిస్ట్ పరిశీలించి వారందరినీ.. తమదైన శైలిలో విచారించారు. వాళ్ళు ఎవరు కాదని తేలింది. మహారాష్ట్రలో మౌని అమావాస్య రోజు క్షుద్ర పూజలు నుండి అమావాస్య పూజలు ఎక్కువ చేస్తారు. దీంతో ఎవరూ కూడా బయటకు రారు. అయితే మంగేష్ కి ఎవరు క్షుద్ర పూజ చేశారు.. అనే కోణంలో పోలీసులు ఆ ప్రాంతంలో సీక్రెట్ గా పెట్టిన కెమెరాలను పరిశీలించారు. ఆ కెమెరాలలో బిచ్చగాడు వేషంలో… పిల్లాడిని వచ్చి పట్టుకెళ్ళిపోయిన అదృశ్యం కనబడుంది.

తర్వాత ఆ మారువేషంలో ఉన్న బిచ్చగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిచ్చగాడిగా మారువేషం వేసుకుని మంగేష్ ని కిడ్నాప్ వ్యక్తి పేరు రూపేష్ మంగనియా. పోలీసులు రూపేష్ ని తమదైన శైలిలో ప్రశ్నించగా… తాను క్షుద్ర పూజలు చేయడం జరిగింది. కానీ ఆ పిల్లవాడిని వేరే ఇద్దరు తీసుకువచ్చారని పోలీసులు వద్ద సంచలన విషయాలు బయట పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరినీ కూడా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఒక ధనవంతుడికి గొప్ప నిధులు మరియు ఆరోగ్యం కోసం… మంగేష్ అనే బాలుడికి కిడ్నాప్ చేసి క్షుద్ర పూజలు చేసి తొమ్మిది భాగాలుగా కట్ చేసి.. 9చోట్ల పూడ్చినట్లు పోలీసుల విచారణలో హంతకులు నిజం ఒప్పుకున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది