Rains | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు .. వాతావరణ శాఖ హెచ్చరిక
Rains | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాల బీభత్సం తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వచ్చే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలతో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
#image_title
ఏపీ వర్షాభావిత జిల్లాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
తెలంగాణలో కూడా వర్షాలు మళ్లీ కురిసే అవకాశముంది. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబాబాద్, సూర్యాపేట, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి, గద్వాల్, నల్లగొండ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముంది.నిన్న సాయంత్రం హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. కొద్ది నిమిషాల్లోనే రోడ్లు జలమయమయ్యాయి.వాతావరణ శాఖ, రెవెన్యూ మరియు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి.