Tea | కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడే అద్భుతమైన హెర్బల్ టీలు!
Tea | ఆరోగ్యకరమైన గుండె కోసం సరైన జీవనశైలి, వ్యాయామం, సంతులిత ఆహారం అవసరం. ఇవి ఎంత ముఖ్యమో, అంతే అవసరం కొన్ని సహజమైన పానీయాలు కూడా. నిపుణుల ప్రకారం, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్న హెర్బల్ టీలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరానికి వెచ్చదనం ఇవ్వడంతో పాటు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి.
#image_title
ఇక్కడ గుండెను ఆరోగ్యంగా ఉంచే, శాస్త్రీయంగా నిర్ధారితమైన ఐదు హెర్బల్ టీలు గురించి తెలుసుకుందాం
1. అల్లం టీ (Ginger Tea)
అల్లంలో ఉన్న జింజెరాల్స్ (Gingerols) శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో సహాయపడుతాయి. BMC Complementary Medicine లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, అల్లం టీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఒక కప్పు అల్లం టీ తాగడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
2. గ్రీన్ టీ (Green Tea)
గ్రీన్ టీ అనేది యాంటీఆక్సిడెంట్లకు నిలయం. ఇందులోని కాటెచిన్స్ (Catechins) శరీరంలో LDL స్థాయిలను తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. Science Direct లో ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం, రోజుకు 2–3 కప్పులు గ్రీన్ టీ తాగడం రక్తపోటు తగ్గించడంలో, బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
3. మందార టీ (Hibiscus Tea)
మందార టీ హృదయ ఆరోగ్యానికి సహజమైన సహాయక పానీయం. Science Direct లో ప్రచురితమైన ఒక క్లినికల్ ట్రయల్ ప్రకారం, 6 వారాల పాటు ప్రతిరోజూ 3 కప్పుల మందార టీ తాగినవారిలో రక్తపోటు స్థాయిలు గణనీయంగా తగ్గాయని తేలింది. మందార టీ యాంటీఆక్సిడెంట్ గుణాలతో కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.