వారెవ్వా.. కొబ్బ‌రి బొండాం నుంచి నీటిని ఎలా తీస్తున్నాడో చూడండి.. వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

వారెవ్వా.. కొబ్బ‌రి బొండాం నుంచి నీటిని ఎలా తీస్తున్నాడో చూడండి.. వీడియో..!

 Authored By maheshb | The Telugu News | Updated on :18 May 2021,7:50 pm

coconut Water :  కొబ్బరి బొండాల‌లోని నీళ్ల‌ను తాగాల్సి వ‌స్తే మ‌నం వాటిని అమ్మే వారి ద‌గ్గ‌ర బొండాల‌ను కొట్టించుకుని తాగుతుంటాం. వారు క‌త్తితో బొండాన్ని క‌ట్ చేసి మ‌న‌కు అందులో స్ట్రా వేసి ఇస్తారు. వాటిని తాగుతాం. లేదా కొబ్బ‌రినీళ్ల‌ను ప్లాస్టిక్ బాటిల్స్ లో వంపి ప్యాక్ చేసి మ‌న‌కు ఇస్తారు. అయితే ఇండోర్‌కు చెందిన ఆ వ్య‌క్తి మాత్రం వెరైటీగా కొబ్బ‌రి బొండాల‌ను క‌ట్ చేసి నీటిని సేక‌రిస్తున్నాడు.

here it is how this man collecting water from coconuts

ఇండోర్‌కు చెందిన అర్జున్ సోనీ అనే వ్య‌క్తి కొబ్బ‌రి బొండాల‌ను coconut Water క‌ట్ చేసేందుకు ఓ నూత‌న మెషిన్‌ను ఉప‌యోగిస్తున్నాడు. క‌రోనా కార‌ణంగా అత‌ను కాంటాక్ట్‌లెస్ ప‌ద్ధ‌తిలో కొబ్బ‌రి నీళ్ల‌ను విక్ర‌యించాల‌ని చెప్పి ఓ మెషిన్‌ను కొనుగోలు చేసి దాంతో కొబ్బ‌రినీళ్ల‌ను సేక‌రించి  విక్ర‌యిస్తున్నాడు. ఆ మెషిన్ కు క‌రెంట్ అవ‌స‌రం లేదు. చేతుల్తో ఆప‌రేట్ చేస్తారు. దానికి ఒక వెడల్ప‌యిన సూది లాంటి ప‌రిక‌రాన్ని అమ‌ర్చి దాని కింద బొండాన్ని ఉంచాలి. ఈ క్ర‌మంలో మెషిన్‌కు ఉండే లీవ‌ర్‌ను కింద‌కు నెడితే అందులోకి సూది దిగుతుంది. త‌రువాత ఆ బొండాన్ని బ‌య‌ట‌కు తీసి దాన్ని బోర్లా ఉంచి అందులోని నీటిని ప్లాస్టిక్ గ్లాస్‌లోకి సేక‌రిస్తాడు. ఆ గ్లాస్‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తాడు.

https://www.facebook.com/foodieincarnate/videos/1642838625901557/

ఇలా అర్జున్ సోనీ చాలా సుర‌క్షిత‌మైన ప‌ద్ధతిలో కొబ్బ‌రినీళ్ల‌ను coconut Water విక్ర‌యిస్తున్నాడు. అలా సేక‌రించిన నీళ్లు ఒక గ్లాస్‌ను అత‌ను రూ.50కి విక్ర‌యిస్తున్నాడు. క‌రోనా వ‌ల్ల బొండాల‌ను నేరుగా తాకి నీటిని తీయకుండా అత‌ను ఈ విధానంలో కొబ్బ‌రినీళ్ల‌ను బ‌య‌ట‌కు తీసి వాటిని గ్లాసుల్లో  పోసి విక్ర‌యిస్తున్నాడు. ఇక అత‌ను అలా కొబ్బ‌రినీళ్ల‌ను తీసే వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలో అత‌న్ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

maheshb

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది