Home » Entertainment » Hero Viswak Sen Sensational Comments
Entertainment

Vishwak Sen : తగ్గేకొద్ది మింగుతారు.. ప్రతి నా కొడుకు తొక్కేవాడే ‘ — విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్ ..

Authored By
aruna
The Telugu News | Published on: October 29, 2023, 6:00 pm
Advertisement

Vishwak Sen  : యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాల కంటే ఎక్కువ వివాదాలలో బాగా ఫేమస్. కాని హీరోగా మంచి సక్సెస్ ని అందుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ నెట్టింటా ఎప్పుడు ఏదో ఒక వివాదంతో ట్రెండ్ అవుతూనే ఉంటాడు. తాజాగా విశ్వక్సేన్ ‘ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ‘ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా విడుదల ఆపాలని, పోస్ట్ ఫోన్ చేయాలని విశ్వక్ సేన్ ని ఎవరో ఒత్తిడి చేశారని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు. తన గత సినిమా ఫలక్నామా దాస్ సమయంలో కూడా చిత్ర పోస్టర్స్, కటౌట్స్ విజయ్ దేవరకొండ నాశనం చేయించాడని రచ్చ చేశాడు విశ్వక్సేన్. నాతో తమాషా కాదు అంటూ వార్నింగ్లు ఇచ్చాడు. అప్పట్లో ఇది సంచలనం అయింది.

Advertisement

మరో సినిమా ‘ అశోకవనంలో అర్జున కళ్యాణం ‘ సినిమా ప్రమోషన్స్ కోసం రోడ్డు పక్కన ఒక ఫ్రాంక్ వీడియో చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదే విషయమై చర్చలో పాల్గొనేందుకు టీవీ9 స్టూడియో కి వెళితే అక్కడ రిపోర్టర్ దేవి నాగవల్లితో పెద్ద లొల్లి అయింది. ఇక బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ తో ఒక వివాదం నడిచింది. ఇక ప్రస్తుతం విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో కూడా ఒక వివాదం తెరపైకి వచ్చింది. విశ్వక్సేన్ తన సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టాడు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మార్చేద్దామని చూసేస్తాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ప్రేమ్ ప్రాణం పెట్టి చేసిన వాడిగా చెబుతున్నా, డిసెంబర్ 8న మన సినిమా కచ్చితంగా రిలీజ్ అవుతుంది.

అది హిట్టా, ప్లాఫా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా అనేది మీ నిర్ణయం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 8 విడుదల కాకపోతే నేను ప్రమోషన్స్ లో పాల్గొనను అని విశ్వక్సేన్ ట్వీట్ చేశాడు. అయితే ప్రస్తుతం ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందా అని చర్చ మొదలైంది. ప్రభాస్ సలార్ సినిమా విడుదల డిసెంబర్ 22 కి మారడంతో కొన్ని సినిమాల విడుదల తేదీలు తారుమారు అయ్యాయి. నాని హాయ్ నాన్న సినిమా ఇదే తేదీకి విడుదల చేయాలని చూశారు. కానీ అది ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే నితిన్ సినిమా కూడా డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారన్నట్లు తెలుస్తుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి