
spider-in-ear-viral-video
Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడెక్కడో జరుగుతున్న వింతలు విశేషాలు తెలుసుకుంటున్నాం. ఎక్కడ ఏం జరిగినా దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది అందరికీ తెలుస్తుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం కొందరు కడుపునొప్పితో ఆసుపత్రికి అని వెళ్లి ఆ తర్వాత లోపల నుంచి వెంట్రుకలు, ఇనుప వస్తువులు బయటికి తీస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. చివరకు చెవి నుంచి పామును తీసిన ఘటన కూడా చూసాం. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
చెవిలో దురద, నొప్పి వస్తుండడంతో ఓ మహిళ డాక్టర్ వద్దకు వెళ్ళింది. పరీక్షించిన వైద్యులు చెవిలో ఉన్న జీవిని చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన తైవాన్ లో చోటు చేసుకుంది. 64 సంవత్సరాలు గల మహిళకు కొన్నాళ్లుగా చెవి నొప్పితో పాటు లోపల నుంచి వింత వింత శబ్దాలు వస్తుండేవి. దీంతో ఆమె ఇంట్లోనే కొన్నిసార్లు ఇంటి వైద్యం చేసింది. అయినా దురద నొప్పి తగ్గకపోవడంతో చివరికి వైద్యుడిని సంప్రదించింది. ఇక ఆమె చెవిని పరిశీలించిన డాక్టర్ లోపల ఉన్న జీవిని చూసి షాక్ అయ్యాడు. మహిళా చెవిలో ప్రాణంతో ఉన్న సాలీడు పురుగులను చూసి కంగుతున్నాడు. చివరకు ట్యూబ్ సహాయంతో సాలీడు పురుగును బయటికి తీశాడు.
చెవికి ఎటువంటి నష్టం జరగకపోవడంతో మహిళ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. నాకు ఇలానే జరిగిందిమ చెవిలో నీళ్లు పోసి విదిలించడంతో బయటికి వచ్చేసింది అని ఒకరు కామెంట్ చేయగా, స్పైడర్ మాన్ అఫ్ ద టర్నల్ ఈమె చెవిలో కొత్త ఉచ్చు వేయబడుతుంది అని ఇంకొకరు, స్పైడర్ ఉమెన్ అని ఇంకొకరు కామెంట్లు చేశారు. వామ్మో చెవులలోకి ఇలాంటి జీవులు కూడా ప్రవేశిస్తున్నాయా అని, ఈమె చెవులు ఏంటి ఇంత శుభ్రంగా ఉన్నాయి అని ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.