Hibiscus Plant Vastu Tips | ఇంట్లో మందార మొక్క ఉండాలి అంటున్న వాస్తు శాస్త్రం..లక్ష్మీ దీవెనలతో పాటు ఆర్థిక శుభఫలితాలు!
Hibiscus Plant Vastu Tips | భారతీయ సంప్రదాయంలో మొక్కలు, పూలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పూజల్లో, వాస్తులో, ఆరోగ్య పరంగా మొక్కలు మన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. ముఖ్యంగా మందార పువ్వు (Hibiscus) కు ఉన్న ప్రాముఖ్యత వేరే స్థాయిలో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, నగరాల్లో కూడా ఈ మొక్కని ఇంటి పరిసరాల్లో నాటడం మామూలే.

#image_title
లక్ష్మీదేవికి ప్రీతికరమైన మందార పువ్వు
వేదాల ప్రకారం మందార పువ్వు లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన పుష్పం. అందువల్ల ఈ పువ్వుతో పూజలు చేయడం ఎంతో శుభప్రదం. ఈ మొక్కను ఇంట్లో పెంచడం ద్వారా సంపద, శ్రేయస్సు, సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మందార పువ్వులు అనేక రంగుల్లో అందుబాటులో ఉన్నా, ఎరుపు రంగు మందారం కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది
వాస్తు శాస్త్రం ప్రకారం మందార మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం ఉత్తమం. ఈ దిశల వల్ల మొక్కకు తగినంత సూర్యకాంతి లభించడంతో పాటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దీనివల్ల కుటుంబసభ్యులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. మంగళవారం బజరంగబలికి మందార పువ్వును సమర్పించడం మంగళదోష నివారణకు ఉపయుక్తమని ధర్మగ్రంధాలు చెబుతున్నాయి. అలాగే సూర్య పూజలో రాగి పాత్రలో మందార పువ్వుతో అర్ఘ్యం ఇస్తే ఇంట్లో ఉన్న సమస్యలు తొలగుతాయని నమ్మకం.