Home Loan : ఉమ్మడి గృహరుణం తీసుకునే ముందర ఈ జాగ్రత్తలు వహించండి.. లేదంటే..
Home Loan : సొంతిల్లు కట్టుకోవాలనేది చాలా మంది కల. ఆ కలను సాకారం చేసుకునేందుకుగాను చాలా మంది తెగ కష్టపడిపోతుంటారు. ఉద్యోగాలు చేసి కొంత డబ్బు సంపాదించుకుని, మరి కొంత డబ్బులు లోన్ ద్వారా తీసుకుని ఇళ్లు కట్టుకుంటుంటారు. అలా సొంతిల్లు కట్టుకోవాలనేది అధిక వ్యయంతో కూడిన విషయమన్న సంగతి అయితే అందరికీ తెలిసే ఉంటుంది. అలా ఇల్లు కట్టుకునేందుకుగాను ఉమ్మడి గృహ రుణం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకుగాను కుటుంబ సభ్యులు మద్దతు తప్పనిసరి. కాగా, రుణం తీసుకునే ముందర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.ఇంటికి కావాల్సిన రుణం సెపరేట్ గానే కాకుండా జాయింట్ గాను తీసుకోవచ్చు.
అనగా ఉమ్మడి గృహ రుణం తీసుకోవడం ద్వారా పలు ప్రయోజనాలుంటాయి. ఎక్కువ రుణం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, ఈ ఉమ్మడి గృహ రుణం తీసుకోవడం వలన కలిగే నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జాయింట్ హోం లోన్ తీసుకునే ముందర గ్యారెంటర్‌ను కలిగి ఉండాలి.ఉమ్మడిగా రుణం తీసుకునే ఆలోచన మంచిదే. జీవిత భాగస్వామితో కలిసి రుణం తీసుకోవడం ద్వారా మీరు అధిక సౌకర్యాలున్న ఇంటిని కొనుగోలు చేయొచ్చు లేదా కట్టుకోవచ్చు కూడా. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మహిళలకు ఇళ్ల రుణాలపై ఇచ్చే రాయితీల గురించి తెలుసుకోవాలి.
అలా రాయితీలను గురించి తెలుసుకుంటే కొంత మేరకు లాభం జరుగుతుంది. సహ దరఖాస్తుదారుడు, సహ యజమాని కూడా రుణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ రుణంతో మీ క్రెడిట్ స్కోర్ మెరుగు పడుతుంది. కానీ, భాగస్వామి రుణ వాటా చెల్లించకపోతే ఇద్దరి క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం పడుతుందన్న సంగతి గ్రహించాలి. ఎవరైనా డిఫాల్ట్ అయితే ఇబ్బందులుంటాయి. కాబట్టి.. నిపుణుల సలహా మేరకు ఈ లోన్ తీసుకుంటే మంచిదని కొందరు సూచిస్తున్నారు. దురదృష్టవశాత్తు జీవిత భాగస్వాముల్లో ఒకరు మరణిస్తే బకాయి చెల్లింపు మిగిలిన వారిపై పడి భారంగా మారొచ్చు.