Gulab Jam Recipe : నోట్లో వేసుకోగానే కరిగిపోయే అద్భుతమైన గులాబ్ జామ్ రెసిపీ మీ కోసమే..!
Gulab Jam Recipe : చుడగానే తినాలనిపించే, ముట్టుకుంటే మెత్త మెత్తగా తగిలే.. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే గులాబ్ జామ్ లు అంటే అందరికీ ఇష్టమే. అయితే ఇవి బయట ఎక్కడో చూసి కాదండోయ్.. ఇంట్లో మీ చేతులతో మీరే తయారు చేసుకోవచ్చు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కావాల్సిన పదార్థాలు.. పావుకేజీ గులాబ్ జామ్ పిండి.. రెండు కప్పుల పాలు, డీ ఫ్రై కి సరిపడా నూనె, రెండు కప్పుల చక్కెర.
తయారీ విధానం.. ముందుగా గులాబ్ జామ్ పండి తీసుకొని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ పిండినీ మొత్తగా తడుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి. గులాబ్ జాములు. అయితే బాగా తడిపిన పిండిని కాసేపు మూత పెట్టుకుని ఉంచాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని… నూనెలో డీ ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత గులాబ్ జామ్ సిరప్ కోసం ఒక బౌల్ తీస్కొని అందులో నాలుగు కప్పుల నీళ్లు పోయాలి. ఆ తర్వాత రెండు కప్పుల చక్కెర వేసి కలుపుతూ ఉండాలి. అలా లేత పాకం వచ్చే వరకూ కలుపుకుంటూ ఉండాలి. అందులో ఇలాచీ పౌడర్ వేస్కోవాలి. పాకం వచ్చాక డీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న గులాబ్ జాములను అందులో వేస్కోవాలి. అంతే సాఫ్ట్ గా ఉండే గులాబ్ జామ్ లు రెడీ. మీరూ ఓ సారి ట్రై చేయండి.