Pawan Kalyan – Chandrababu : ముఖ్యమంత్రి లేదు ఏమీ లేదు.. ముప్పై సీట్లు పవన్ కళ్యాణ్ ముఖాన కొట్టిన చంద్రబాబు..!
Pawan Kalyan – Chandrababu : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇంకో చాన్స్ ఇవ్వండి అంటూ వైసీపీ పార్టీ ప్రజలను కోరుతుండగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క చాన్స్ అంటున్నారు. ఇప్పటి వరకు అందరికీ చాన్స్ ఇచ్చారు. నాకు కూడా ఒక్క చాన్స్ ఇవ్వండి. రాష్ట్రాన్ని మార్చి చూపిస్తాను అని అంటున్నారు పవన్ కళ్యాణ్. నిజానికి జనసేన అధినేతకు ఒక్క చాన్స్ అయినా ఇవ్వాలని ఏపీ ప్రజలు అనుకుంటున్నా.. అడ్డుపడటానికి ఇతర పార్టీలు ఉన్నాయి కదా.
ఏది ఏమైనా.. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే సీన్ అయితే లేదు. ఎందుకంటే.. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోగలిగితేనే ఆయన సీఎం అయ్యే అవకాశం ఉంది. గెలిచే అవకాశం ఉంది.ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అన్ని సీట్లను గెలుచుకోగలుగుతుందా? అది సాధ్యం అవుతుందా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ.. పవన్ కళ్యాణ్ ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు వస్తాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. బీజేపీతో పొత్తుతో ఉన్నారు కానీ.. ఏనాడూ బీజేపీతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనలేదు. నిజానికి.. టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Pawan Kalyan – Chandrababu : 30 సీట్లు డిమాండ్ చేసినా పవన్ సీఎం అవుతారా?
ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది. ఒకవేళ జనసేన 30 సీట్ల దాకా డిమాండ్ చేస్తే టీడీపీ ఇస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఒకవేళ పవన్ కళ్యాణ్.. 30 సీట్లు డిమాండ్ చేస్తే.. టీడీపీ ఒప్పుకుంటే పవన్ సీఎం అవుతారా? 30 సీట్లు గెలిచినా పవన్ కు ముఖ్యమంత్రి పదవి వస్తుందా? అనేది డౌటే. ఒక్క వైసీపీ మాత్రం ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతోంది. దానికి తగ్గట్టుగా జనసేన ఎలా ప్లాన్ చేసుకొని ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంది.. అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. చూద్దాం మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో?