Pawan Kalyan – Chandrababu : పవన్ కళ్యాణ్ – చంద్రబాబులకి గుబులు పుట్టించే న్యూస్.. ఏపీలో ముందస్తు ఎన్నికలు..!
Pawan Kalyan – Chandrababu : ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒక సంవత్సరం సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. వైసీపీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. సీఎం జగన్ పార్టీ నేతలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇప్పటి నుంచే పార్టీ నేతలంతా ప్రజల్లో ఉండేలా కొత్త కార్యక్రమాన్ని డిజైన్ చేశారు సీఎం జగన్. అది ఒకరకంగా ఎన్నికల ప్రచారమే. అదే జగనన్నే మా భవిష్యత్తు అనే పేరుతో డోర్ టు డోర్ వెళ్లేలా కార్యక్రమాన్ని సీఎం జగన్ డిజైన్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి మూల, ప్రతి ఇల్లు కవర్ అయ్యేలా..
7వ తారీఖు నుంచి 20 వరకు ప్రతి ఇంటికి నేతలు వెళ్లాలని జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలోని మండలం, వార్డు, డోర్ టు డోర్ వెళ్లేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు పక్కా వ్యూహాన్ని రచించారు. ఇది ప్రతి ఒక్క ఏపీ పౌరుడికి జగన్ తోనే భవిష్యత్తు అనే నమ్మకాన్ని కలిగించడం కోసం తీసుకొచ్చిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కుటుంబాలను కవర్ చేయడం కోసం సుమారు ఏడు లక్షల మంది పాల్గొననున్నారు.
Pawan Kalyan – Chandrababu : 1.65 కోట్ల కుటుంబాలకు చేరువ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.65 కోట్ల కుటుంబాలను కలిసి వారికి ప్రభుత్వ పథకాలు అన్నీ అమలు అవుతున్నాయా? లేదా? ఏదైనా సమస్య ఉందా? అనే కోణంలో మాట్లాడనున్నారు. పాస్ట్ వర్సస్ ప్రెజెంట్ పేరుతో గత ప్రభుత్వాల హయాంలో ఏం జరిగింది.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ ప్రభుత్వ అభివృద్ధి ఎంత ముందుకు వెళ్లింది అనేదానిపై కన్వీనర్లు ప్రతి ఇంటికి ఒక పాంప్లెట్ ను ఇస్తారు. దాని ఆధారంగా వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకొని ఆ ఇంట్లో సర్వే పూర్తయ్యాక ఇంటి డోర్ కి ఒక స్టిక్కర్ అతికిస్తారు. ఇది కేవలం ప్రభుత్వాని ప్రతి ఇంటికి దగ్గర చేస్తుందని.. అలాగే ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం ఉందని వైసీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.