Pawan Kalyan – ChandraBabu : పవన్ కళ్యాణ్ – చంద్రబాబుల మీద వైఎస్ జగన్ మార్క్ బ్రహ్మాస్త్రం బయటకి తీశాడు..!
Pawan Kalyan – ChandraBabu : ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ అయితే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కేవలం గెలుపు మాత్రమే కాదు.. కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టుగా పూర్తిగా ఏపీలో ఉన్న ఎమ్మెల్యే సీట్లు అన్నింటినీ గెలుచుకోవాలని పార్టీ నేతలకు చెబుతున్నారు. వాళ్లను మోటివేట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం గెలిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఎలాగైనా ప్రత్యర్థి పార్టీలను మట్టికరిపించాలని నేతలకు చెబుతున్నారు. మునుపటికన్నా కూడా ఓటింగ్ శాతాన్ని
పెంచుకునేందుకు జగన్ వ్యూహాలను రచిస్తున్నారు. నిజానికి.. ఏపీలో ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం చాలా పథకాలను ప్రారంభించింది. అవన్నీ బడుగు, బలహీన వర్గాల కోసం ప్రారంభించినవే. అందుకే.. కేవలం సంక్షేమ పథకాలే తమను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని వైసీపీ ఆశపడుతోంది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రజలకు దగ్గరయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తారని వైసీపీ విశ్వసిస్తోంది.ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరు టీడీపీ, జనసేన పార్టీల వైపు మళ్లకుండా ఉండేందుకు వైఎస్ జగన్ గడప గడపకూ ప్రభుత్వం అనే ప్రభుత్వాన్ని ప్రారంభించి…
Pawan Kalyan – ChandraBabu : అందుకే గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం
దాని ద్వారా వాలంటీర్లతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లకు ప్రభుత్వం ద్వారా పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాలు తెలుసుకోవాలి. వాళ్ల అభిప్రాయాలను కూడా తెలుసుకునేలా జగన్ వ్యూహాలు రచించారు. అలాగే.. మూడు రాజధానుల వల్లనే ఏపీ అభివృద్ధి చెందుతుందని.. ఒక్క రాజధాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని జగన్ ప్రజలకు చెప్పేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ ను పరిపాలన రాజధానిగా ప్రారంభించేందుకు వ్యూహాలు కూడా రచించారు. త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన సాగే అవకాశం ఉంది. ఇలా.. అన్ని రకాలుగా ప్రత్యర్థ పార్టీలను ఇరుకున పెట్టి వచ్చే ఎన్నికల్లో విజయదుందుబి మోగించడమే వైఎస్ జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది.