Wife : భార్య తోడుంటే ఈ ప్రభుత్వ స్కీం మీదే.. కోటిన్నర మిస్ చేసుకోకండి..!
ప్రధానాంశాలు:
Wife : భార్య తోడుంటే ఈ ప్రభుత్వ స్కీం మీదే.. కోటిన్నర మిస్ చేసుకోకండి..!
Wife : ఇప్పుడు ప్రభుత్వ స్కీంలు చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. పదవీ విరమణ కోసం స్మార్ట్ ఫండ్ సృష్టించాలనుకుంటే PPF ఒక గొప్ప అప్షన్. మీరు ఈ పథకంలో కొంచెం తెలివైన ప్లాన్ తో పెట్టుబడి పెడితే, మీరు ఎటువంటి ప్రమాదం లేకుండా చాలా డబ్బు సంపాదించవచ్చు. ఇంకా మీ భార్య సపోర్ట్ లభిస్తే కేవలం 20 సంవత్సరాలలో లక్షాధికారి అవ్వొచ్చు.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు హామీతో కూడిన రాబడి పొందవచ్చు.

Wife : భార్య తోడుంటే ఈ ప్రభుత్వ స్కీం మీదే.. కోటిన్నర మిస్ చేసుకోకండి..!
ప్లాన్ ప్రకారం పెట్టుబడి పెడితే కేవలం 20 సంవత్సరాలలో లక్షాధికారి కావచ్చు. 15 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం ఉన్న ఈ పథకంలో మీరు తక్కువ సమయంలోనే చాలా డబ్బు సంపాదించవచ్చు. ఈ స్కిం పెట్టుబడి సూత్రం ఏంటో తెలుసా.. దీని సహాయంతో మీరు డబ్బు సంపాదించడం ద్వారా లక్షాధికారి కావచ్చు. అది కూడా కేవలం 20 సంవత్సరాలలో రూ.1.33 కోట్లు కూడబెట్టొచ్చు. మీ భార్యతో కలిసి పెట్టుబడి పెట్టండి
పీపీఎఫ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన పేరు మీద ఒక పీపీఎఫ్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయోచ్చు. మీ భార్య ఉద్యోగం లేదా ఏదైనా పని చేస్తే మీరిద్దరూ మీ పేర్లతో వేర్వేరు అకౌంట్స్ తెరవాలి. 20 సంవత్సరాలలో లక్షాధికారి కావాలంటే ఇద్దరూ మీ అకౌంట్లలో రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మీరిద్దరూ సంవత్సరానికి రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేస్తే లక్షాధికారి కావాలనే మీ కల 20 సంవత్సరాలలో నెరవేరుతుంది. ఇలా 20 సంవత్సరాల పాటు రూ.1.5 లక్షలు కొనసాగిస్తే ఇద్దరి PPF అకౌంట్లలో ఒక్కొక్కరికి రూ.30 లక్షలు జమ చేయబడతాయి.