Cracked heels | పాదాల పగుళ్ల సమస్యకు నేచురల్ ఆయుర్వేద పరిష్కారం .. ఇంట్లోనే సులభంగా ట్రై చేయండి
Cracked heels | పాదాల పగుళ్లు ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పులు లేక నడిచితే సమస్య మరింత పెరుగుతుంది. మట్టిలో నడిచినా లేదా బట్టలు పిండినా పాదాల పగుళ్లు తీవ్రత పెరుగుతాయి. అయితే, ఆయుర్వేదం ప్రకారం దీనికి కూడా సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. కొన్ని నూనెలతో మసాజ్ చేయడం ద్వారా 7 రోజుల్లోనే పాదాలు సాఫ్ట్‌గా, బేబీ లాంటి మృదువుగా మారతాయి.
#image_title
కావాల్సిన పదార్థాలు:
నువ్వుల నూనె – 90 మి.లీ
వేప నూనె – 30 మి.లీ
అలోవెరా జెల్ – 1 టీస్పూన్
పసుపు – 1 టీస్పూన్
చందనం పొడి – 1 టీస్పూన్
వేప పొడి – 1 టీస్పూన్
తయారీ మరియు ఉపయోగం:
పైన పేర్కొన్న పదార్థాలను ఒక గిన్నెలో కలపాలి.
డబుల్ బాయిల్ మెథడ్ లో వేడి చేయాలి.
పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడకండి.
తయారుచేసిన మిశ్రమంతో పాదాలకు మసాజ్ చేయండి.
కాటన్ సాక్స్ వేసి రాత్రంతా ఉంచండి.
రెగ్యులర్‌గా ఇలా చేస్తే పాదాల పగుళ్లు తగ్గతాయి.
లాభాలు:
పాదాలను లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది, కోమలంగా మారుస్తుంది.
యాంటీ మైక్రోబయల్ గుణాల కారణంగా చర్మాన్ని త్వరగా రిపేర్ చేస్తుంది.
పగుళ్ల రహిత, మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి.
తులసి పద్ధతి:
తులసి పేస్ట్, అలోవెరా జెల్, కర్పూరం కలిపి పాదాలకు మసాజ్ చేయడం ద్వారా కూడా పగుళ్లను తగ్గించవచ్చు.
జాగ్రత్తలు:
పాదాలను 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానాలి.
తర్వాత ప్యూమిస్ రాయితో స్క్రబ్ చేసి డెడ్ స్కిన్ తొలగించాలి.
హార్ష్ క్రీమ్స్ బదులు కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ వాడాలి.
రాత్రి పాదాలకు మసాజ్ చేసి సాక్స్ వేసుకోవడం అలవాటు చేసుకుంటే పాదాలు సాఫ్ట్‌గా, పగుళ్ల రహితంగా ఉంటాయి.