Atal Pension Yojana : నెలకు రూ.210 కడితే చాలు.. జీవితాంతం రూ.5000 పెన్షన్ వస్తుంది.. ఎలాగో తెలుసా?
Atal Pension Yojana : పెన్షన్ అంటే అందరికీ తెలుసు.. ఎవరైనా తమ ఉద్యోగంలో పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చేదే పెన్షన్. ఉద్యోగులకు ఓకే.. పదవీ విరమణ తర్వాత పెన్షన్ వస్తుంది. మరి.. ఉద్యోగం లేని వారి సంగతి.. పొట్ట కోసం కూలి పని చేసుకొని బతికేవాళ్ల సంగతి.. అసంఘటిత రంగంలో పని చేసే కార్మికుల సంగతి.. అటువంటి వాళ్ల కోసమే.. కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. అంటే.. ఈ పథకం ప్రకారం.. పదవీ విరమణ వయసు వచ్చిన తర్వాత పెన్షన్ డబ్బులను కేంద్రం అందిస్తుందన్నమాట.
60 ళ్ల తర్వాత.. ప్రతి నెల పింఛన్ టంచనుగా ఇంటికి వస్తుంది. ఈ పథకంలో చేరాలనుకునేవాళ్ల వయసు 18 ఏళ్ల పైబడి ఉండాలి.. 40 ఏళ్ల లోపు ఉండాలి. ఈ పథకం ప్రకారం.. 18 సంవత్సరాలు నిండిన వాళ్లు 42 ఏళ్ల వరకు అంటే.. 60 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లిస్తే.. 60 ఏళ్ల తర్వాత వాళ్లకు ప్రతి నెల రూ.5000 పెన్షన్ వస్తుంది. ఈ పథకంలో చేరాలనుకుంటే.. ఏదైనా ఒక బ్యాంకులో అకౌంట్ ఉంటే చాలు. లేదంటే.. పోస్ట్ ఆఫీసులో అయినా ఈ పథకానికి అప్లయి చేసుకోవచ్చు.
Atal Pension Yojana : 60 ఏళ్ల వరకు కంట్రిబ్యూషన్ చేస్తే చాలు
ఒకవేళ ఈ పథకంలో చేరి.. కొన్ని ఏళ్ల పాటు డబ్బులు చెల్లించాక.. ఆ వ్యక్తి మరణిస్తే.. అతడి నామినీకి అప్పటి వరకు కట్టిన డబ్బును వడ్డీతో సహా అందజేస్తారు. లేదంటే.. నామినీ పథకాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. నామినీకి 60 ఏళ్లు దాటాక.. పెన్షన్ ను ప్రభుత్వం అందిస్తుంది. ఒకవేళ ముందే ఈ పథకం నుంచి వైదొలగాలనుకున్నా కూడా ఈ పథకంలో కొన్ని ఆప్షన్లు ఉంటాయి. ఏది ఏమైనా చిన్న వయసులోనే ఈ పథకంలో చేరితే చాలా లాభాలు ఉంటాయి. తక్కువ డబ్బు చెల్లించి.. ఎక్కువ మొత్తాన్ని పదవీ విరమణ తర్వాత పొందొచ్చు.