Atal Pension Yojana : ఓల్డేజ్ లో పెన్షన్ పొందడానికి బెస్ట్ స్కీమ్ ఇదే… కేంద్రం ఆధ్వర్యంలో అందరికీ..
Atal Pension Yojana : వృద్దాప్యంలో అవసరాలు తీర్చుకునేలా కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ తీసుకువచ్చింది. వివిధ రంగాల్లోని కార్మికులు, ఇతరులకు భద్రత నిమిత్తం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ని ప్రవేశపెట్టింది. 2015లో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటింగా అదే సంవత్సరం మే 9న కోల్‌కతాలో ప్రధాని మోడీ ప్రారంభించారు. వృద్దాప్యంలో రక్షణ కోసం స్వచ్ఛందంగా పొదుపు చేసుకునేలా ఈ స్కీం ప్రోత్సహిస్తోంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల భారతీయ పౌరులెవరైనా ఈ స్కీమ్ ని పొందడానికి అర్హులు. కాగా ప్రతినెలా కొంత మొత్తంలో పొదుపు చేసుకోవడం ద్వారా 60 ఏళ్లు వయసు నిండిన నాటి నుంచి ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ. 1000 నుంచి రూ.5000 కనీస పెన్షన్ పొందే అవకాశం ఉంది.
కాగా ఈ స్కీమ్‌లో భార్యాభర్తలు ఇద్దరూ అర్హులు. 60 ఏళ్ల వయసు పైబడిన తర్వాత తాము చెల్లించిన ప్రీమియం బట్టి నెలకు రూ.5 వేల వరకు పెందే అవకాశం ఉంది. అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.10 వేల పెన్షన్ పొందే అవకాశం ఉంది. కాగా తక్కువ వయసు నుంచే ఈ పథకంలో చేరి ప్రీమియం చెల్లించినట్లైతే అంత ఎక్కువ లాభం పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజనలో 18 ఏళ్లు ఉన్నప్పుడు చేరితే నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు ప్రీమియం చేయాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొలది ఈ మొత్తం పెరుగుతూ ఉంటుంది. ఈ స్కీమ్ కింద కనీసం 20 ఏళ్లు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. నెలవారీ, క్వార్టర్లీ, అర్థ వార్షికం చొప్పున పెన్షన్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్స్ చేసే అవకాశం ఉంది.
అయితే అన్ని జాతీయ బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. సదరు బ్యాంక్ వెబ్‌సైట్‌కి వెళ్లి, అటల్ పెన్షన్ అకౌంట్‌ను తెరవవచ్చు. ఆన్‌లైన్‌గా లేదా బ్యాంకుల వద్దకి నేరుగా వెళ్లి దరఖాస్తు ఫామ్ నింపి అప్లయ్ చేసుకునే వెసులు బాటు ఉంది. వాలిడ్ మొబైల్ నెంబర్ తో పాటు.. ఆధార్ కార్డు ఫోటో కాఫీని కూడా జత చేయాలి. అప్లికేషన్ అప్రూవల్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. రూ.1000 పింఛన్ రావాలంటే కనీసం నెలకు రూ.42 కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రూ.5 వేలు పెన్షన్ కోసం నెలకు రూ.210 కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అదే మూడునెలలకు గాను రూ.626, ఆరు నెలలకు గాను రూ.1,239 కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కాగా నామినీకి ఏక మొత్తంలో రూ. 8.5 లక్షలు చెల్లిస్తారు. ఈ రకంగా భార్యాభర్తలకు రూ.10 వేలు పెన్షన్ పొందే అవకాశం ఉంది.