Facebook Profile : మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ ను ఎవరు చెక్ చేశారో తెలుసుకోండిలా?
Facebook Profile : నేటి జనరేషన్ కు ఫేస్ బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఫేస్ బుక్ వాడని వాళ్లు లేరు.. అందులో అకౌంట్ లేని వాళ్లు లేరు. ఫేస్ బుక్ అంటేనే అదో వర్చువర్ ప్రపంచం. ఫేస్ బుక్ ద్వారా చాలామందితో కనెక్ట్ అవ్వొచ్చు. తెలియని ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఫేస్ బుక్ వల్ల ప్రపంచంలో ఏం జరుగుతోంది… ప్రపంచంలో ట్రెండింగ్ లో ఉన్న విషయాలను కూడా తెలుసుకోవచ్చు. అలాగే.. చాటింగ్, వీడియో కాలింగ్ ఆప్షన్ కూడా ఫేస్ బుక్ లో ఉండటంతో ఫేస్ బుక్ ను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫేస్ బుక్ ను ఏదో టైమ్ పాస్ కోసం కాకుండా.. తమ బిజినెస్ కోసం ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు కొందరు. ఏది ఏమైనా నేటి తరానికి ఫేస్ బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రోజురోజుకూ సరికొత్త ఫీచర్లతో ఫేస్ బుక్ తన కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఒక్క ఇండియాలోనే కొన్ని కోట్ల ఫేస్ బుక్ అకౌంట్లు ఉన్నాయి. సాధారణంగా ఫేస్ బుక్ లో ఎవరైనా పోస్ట్ పెడితే… ఆ పోస్ట్ కు లైక్స్, కామెంట్లు గట్రా వస్తే.. అవి ఎవరు చేశారో ఇట్టే తెలుసుకోవచ్చు. కానీ.. మన ప్రొఫైల్ ను ఎవరైనా విజిట్ చేశారా? అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే.. మన ఫేస్ బుక్ అకౌంట్ ను చాలామంది చూస్తుంటారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే మనకు తెలుస్తుంది కానీ… ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించకపోతే… మన ప్రొఫైల్ ను ఎవరు చూశారు అనే విషయం తెలియదు. అందుకే… మన ఫేస్ బుక్ ప్రొఫైల్ ను ఎవరు చూశారు అనేది తెలుసుకోవడం కోసం ఒక ఆప్షన్ ఉంది.
Facebook Profile : మీరు ఆపిల్ ప్రాడక్ట్స్ వాడితే?
ఒకవేళ మీరు యాపిల్ ప్రాడక్ట్స్ వాడితే.. ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఫేస్ బుక్ ను ఉపయోగిస్తారు కాబట్టి… అందులో ఫేస్ బుక్ ఓపెన్ చేసి.. ప్రైవసీ సెట్టింగ్స్ ద్వారా మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ ను ఎవరు చెక్ చేశారో చూసుకోవచ్చు. ఫేస్ బుక్ సెట్టింగ్స్ లో ప్రైవసీ షార్ట్ కట్స్ లో Who Viewed My Profile అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే… మిగితా ఫేస్ బుక్ యూజర్లు ఎప్పుడు మీ ప్రొఫైల్ ను చెక్ చేశారో తెలుస్తుంది. 2018 లోనే కేవలం ఐఓఎస్ వినియోగదారుల కోసమే ఈ ఆప్షన్ ను ఫేస్ బుక్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఆప్షన్ రాలేదు.
Facebook Profile : పీసీలో చెక్ చేసుకోవడం ఎలా?
పీసీలో అయితే ఎవరైనా ఫేస్ బుక్ ప్రొఫైల్స్ ను చెక్ చేసుకోవచ్చు. మీ డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ లో ఫేస్ బుక్ లాగిన్ అయ్యాక.. మీ అకౌంట్ ఓపెన్ అయ్యాక.. మౌస్ తో ఎక్కడైనా రైట్ క్లిక్ చేసి View Page souce మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఫేస్ బుక్ అకౌంట్ పేజీ సోర్స్ కోడ్ కనిపిస్తుంది. ఆ సోర్స్ కోడ్ ఓపెన్ అయ్యాక… కంట్రోల్ ప్లస్ ఎఫ్ ప్రెస్ చేసి BUDDY_ID అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు కర్సర్ డైరెక్ట్ గా buddy_id ఎక్కడ ఉందో అక్కడికి తీసుకెళ్తుంది. అక్కడ ఈ ఐడీ ట్యాగ్ పక్కన 15 అంకెల కోడ్ ఒకటి ఉంటుంది. ఆ కోడ్ ను కాపీ చేసి… కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి… www.facebook.com/15 అంకెల డిజిట్ కోడ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అంతే… డైరెక్ట్ గా మీ ప్రొఫైల్ ను చూసిన వాళ్ల పేస్ బుక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పటి వరకు మీ ఫేస్ బుక్ అకౌంట్ ను ఎంతమంది చూశారో… అంతమంది ఫేస్ బుక్ ప్రొఫైల్ ఐడీలు సోర్స్ కోడ్ లో ఉంటాయి. అవన్నీ కాపీ చేసుకొని చెక్ చేసుకోవడమే.