Pawan Kalyan : కేరళ మార్కిస్టు గ్రూప్ మెంబర్ ప్రొఫైల్ ఫోటోగా పవన్ కళ్యాణ్.. అసలు కథ ఏంటి..?
ప్రధానాంశాలు:
Power Star : కేరళ మార్కిస్టు గ్రూప్ మెంబర్ ప్రొఫైల్ ఫోటోగా పవన్ కళ్యాణ్.. అసలు కథ ఏంటి..?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ Pawan Kalyan ఇమేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. Telugu Movie తెలుగు సినిమాలే చేస్తూ వచ్చిన పవర్ స్టార్ యూత్ ఆడియన్స్ కు హాట్ ఫేవరెట్ గా మారాడు. అందుకే ఆయన అంటే అదో రకమైన పిచ్చి అనేలా చేస్తుంటారు. పవన్ ఇప్పుడు సినిమాలోనే కాదు రాజకీయాల్లో కూడా తన ముద్ర వేస్తున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపిస్తున్నాడు.ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇప్పుడు రాష్ట్రాలు దాటింది. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు కేరళలో కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆయన లోని రెబలిజానికి అక్కడ ఒక మార్కిస్ట్ గ్రూప్ సభ్యుడే తన ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. ఇదేదో ఈమధ్య జరిగింది కాదు. దాదాపు 7 ఏళ్లుగా పవన్ ఫోటోనే వారి సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా ఉంది.
Pawan Kalyan : రెబల్ ఇజం కనిపిస్తుందని..
కేరళ మార్కిస్ట్ గ్రూప్ మెంబర్ అయిన పోరాలి షాజి ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ గా పవన్ కళ్యాణ్ Pawan Kalyan ఫోటో ఉంటుంది. దానికి కారణంగా వారు చెప్పేది ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెబల్ ఇమేజ్ కి నిదర్శనమని వారు నమ్ముతున్నారట. అందుకే ఆ ఫోటోలో రెబల్ ఇజం కనిపిస్తుందని దాన్ని వారి ప్రొఫైల్ గా పెట్టుకున్నారు. 7 ఏళ్లుగా అదే ప్రొఫైల్ పిక్ ని కొనసాగిస్తున్నారు.
కేరళలో ఎంతోమంది సూపర్ స్టార్స్ ఉన్నా కూడా తెలుగు స్టార్ అయిన పవన్ కళ్యాణ్ ఫోటోనే వారు పెట్టుకోవడంలో పవర్ స్టార్ రేంజ్ ఏంటన్నది తెలుస్తుంది. ఏది ఏమైనా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ ఆలస్యంగా తెలిసినా ఇలా ఒకరు చెప్పడం ఆలస్యం ఆ పేజ్ ని లైక్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే 1 మిలియన్ ఫాలోవర్స్ తో ఆ పేజ్ సూపర్ గా కొనసాగుతుందని తెలుస్తుంది. Power Star Pawan Kalyan, Pawan Kalyan, Kerala, Facebook, Tollywood