Whatsapp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ డీపీని వాట్సాప్ డీపీగా పెట్టుకోవచ్చు!
ప్రధానాంశాలు:
Whatsapp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ డీపీని వాట్సాప్ డీపీగా పెట్టుకోవచ్చు!
Whatsapp : సోషల్ మీడియా Social Media దిగ్గజ సంస్థ మెటా తన యాప్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతోంది. తాజాగా వాట్సాప్‌లో ఓ కీలక ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. దీనివల్ల ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్చర్‌ను నేరుగా వాట్సాప్‌లో Whatsapp ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకోవచ్చు.ఇప్పటివరకు వాట్సాప్ యూజర్లు తమ డీపీని గ్యాలరీ నుంచి ఎంచుకోవడం లేదా కెమెరా ద్వారా క్లిక్ చేయడం ద్వారా మార్చుకునే వీలుండేది.

Whatsapp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ డీపీని వాట్సాప్ డీపీగా పెట్టుకోవచ్చు!
Whatsapp : ఆకర్షణీయమైన ఫీచర్..
కానీ కొత్త అప్‌డేట్‌తో, ఇప్పుడు Instagram, Facebook నుంచి ఫోటోను ఎంచుకునే ఆప్షన్ కూడా లభిస్తుంది. ఫీచర్ ప్రస్తుతం WhatsApp Beta version 2.25.21.23 లో కనిపిస్తోంది. కొంతమంది బీటా టెస్టర్లకు ఇప్పటికే ఈ అప్‌డేట్ అందింది. మిగతా యూజర్లకు కూడా రాబోయే వారాల్లో ఇది అందే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ను వినియోగించుకోవాలంటే, మీరు ముందుగా మీ మెటా ఖాతాలను (WhatsApp, Instagram, Facebook) Meta Accounts Center ద్వారా లింక్ చేసి ఉండాలి. అనంతరం, వాట్సాప్‌లో ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Edit Profile Picture’ క్లిక్ చేస్తే, Instagram మరియు Facebook అనే రెండు కొత్త ఎంపికలు కనిపిస్తాయి.
మీరు అక్కడి నుంచి నేరుగా ఫోటోను సెలెక్ట్ చేసుకుని డీపీగా పెట్టుకోవచ్చు. చాలా మంది యూజర్లు తమ Facebook లేదా Instagram డీపీలను WhatsAppలో పెట్టుకోవాలనుకుంటారు. కానీ ఇప్పటి వరకూ ఫోటోను డౌన్‌లోడ్ చేయడం లేదా స్క్రీన్‌షాట్ తీసుకోవడం వంటి అసౌకర్యాలుంటాయి. ఇది ఫోటో నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది.ఇప్పుడు ఈ ఫీచర్ ద్వారా ఒకే క్లిక్‌తో మీ మెటా ప్రొఫైల్ నుంచి నేరుగా నాణ్యత తగ్గకుండా డీపీ మార్చుకోవచ్చు. దీని వలన WhatsApp, Facebook, Instagram మధ్య అనుభవాన్ని మరింత సమగ్రంగా చేయగలుగుతారు.