Whatsapp Status : వాట్సప్ స్టేటస్ ను డైరెక్ట్ గా ఫేస్‌బుక్‌లోనూ షేర్ చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
Whatsapp Status : వాట్సప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రముఖ మెసెంజర్ యాప్ అది. వాట్సప్ లేని వాళ్లు ఈరోజుల్లో ఎవ్వరూ ఉండరు. ఎక్కువ శాతం ఇప్పుడు అందరూ ఉపయోగించేది అదే. ఫోటోలు పంపించాలన్నా.. వీడియోలు పంపించాలన్నా.. ఆడియో కాల్స్, వీడియో కాల్స్, మెసేజెస్.. ఇలా ప్రతిదానికి అందరూ ఉపయోగించేది వాట్సప్. అది లేకుంటే ఏ పని జరగదు.
అందుకే వాట్సప్ లో రోజురోజుకూ పలు రకాల ఫీచర్లను ఫేస్ బుక్ కంపెనీ మెటా యాడ్ చేస్తోంది. సాధారణంగా వాట్సప్ అయినా ఫేస్ బుక్ అయినా ఏ సోషల్ నెట్ వర్క్ అయినా అందులో స్టేటస్ ను షేర్ చేసుకోవచ్చు. ఆ స్టేటస్ ను మన ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవాళ్లు చూస్తారు. అయితే వాట్సప్ కు, ఫేస్ బుక్ కు ఇదివరకు వేర్వేరుగా ఆయా అప్లికేషన్లలోకి వెళ్లి స్టేటస్ షేర్ చేసుకోవాల్సి వచ్చేది.
Whatsapp Status : ఆటో షేర్ ఆన్ ఫేస్ బుక్ ఆప్షన్ ను తీసుకొచ్చిన మెటా
ఆటో షేర్ ఆన్ ఫేస్ బుక్ అనే ఆప్షన్ ను ఫేస్ బుక్ కొత్తగా తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా వాట్సప్ లో షేర్ చేసిన స్టేటస్ ను నేరుగా ఫేస్ బుక్ లోనూ షేర్ చేయొచ్చు. దాని కోసం ఆటో షేర్ ఆన్ ఫేస్ బుక్ అనే ఆప్షన్ ను ఆన్ చేసి ఉంచాలి. అప్పుడు వాట్సప్ లో ఏ స్టేటస్ పెడితే అది నేరుగా ఫేస్ బుక్ లోనూ యాడ్ అవుతుంది. ప్రస్తుతం ఇది బీటా వర్షన్ యూజర్లకే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే అందరు యూజర్లకు ఈ ఆప్షన్ అందుబాటులోకి రానుంది.