Mutton Dum Biryani Recipe : హైదరాబాది మటన్ దమ్ బిర్యాని… ఎంతో సింపుల్ గా ఇలా ట్రై చేయండి…
Mutton Dum Biryani Recipe : హైదరాబాది బిర్యాని అంటే ఎవరికైనా నోట్లో నీళ్లు ఉరాల్సిందే.. ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది. హైదరాబాది బిర్యానీలు తిన్నవాళ్లు అస్సలు మరువరు. అలాంటి బిర్యానీలలో ఒకటి. మటన్ దమ్ బిర్యాని ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : ఒక కేజీ మటన్, బాస్మతి రైస్, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నల్లయాలకులు, సాజీర, అనాసపువ్వు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నెయ్యి, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పౌడర్, ఉప్పు, పెరుగు, ఆనియన్స్, పసుపు, కారం, పచ్చి బొప్పాయి పేస్ట్, నిమ్మరసం, నీళ్లు, ఆయిల్ మొదలైనవి..
దీని తయారీ విధానం: ముందుగా ఒక కేజీ మటన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా, ఒక బిర్యానీ ఆకు, రెండు యాలకులు, నాలుగు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, నాలుగు పచ్చిమిర్చి, నాలుగు స్పూన్ల ఆయిల్, రెండు స్పూన్ల నెయ్యి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ బొప్పాయి పేస్టు వేసి బాగా కలుపుకొని దానిని ఓవర్ నైట్ అంతా ఫ్రిజ్లో పెట్టి ఉంచుకోవాలి.ఇక మర్నాడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక అర లీటర్ నీళ్లు పోసుకుని దాంట్లో ఒక స్పూన్ షాజీరా, రెండు యాలకులు రెండు లవంగాలు ఒక స్పూన్ ఉప్పు రెండు అనాస పువ్వులు వేసి మూత పెట్టి బాగా ఆ నీటిని మరిగించుకోవాలి.
తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ని ఆ వాటర్ లో వేసి 60% ఉడికించుకొని తర్వాత ఆ వాటర్ లోంచి రైస్ తీసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ లో ఈ రైస్ ని పరుచుకొని దానిపైన కొంచెం నెయ్యిని ,వేసి కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసుకొని, ఆ రైస్ ఉడికించిన వాటర్ ని కొంచెం పైన చల్లి, కొత్తిమీర చల్లి, కొంచెం గరం మసాలా చల్లి ఆవిరి పోకుండా మూతను పెట్టి 80% వరకు ఒక 15 మినిట్స్ హై లో ఉడికించి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపి పది నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా హైదరాబాది మటన్ దమ్ బిర్యాని రెడీ. ఒక్కసారి తిన్నారంటే ఇక అస్సలు వదలరు.