Mutton Dum Biryani Recipe : ఇంట్లో అందరికీ నచ్చే ఈజీ సూపర్ ఫాస్ట్ మటన్ దమ్ బిర్యాని…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mutton Dum Biryani Recipe : ఇంట్లో అందరికీ నచ్చే ఈజీ సూపర్ ఫాస్ట్ మటన్ దమ్ బిర్యాని…!

Mutton Dum Biryani Recipe : ఈరోజు మటన్ దమ్ బిర్యాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్ చాలా సింపుల్. అండ్ ఈజీ అన్నమాట.. పక్కాగా 100% మటన్ బిర్యానీ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది.  దీని తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు: మటన్, బాస్మతి రైస్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, పెరుగు, నిమ్మరసం, ఆయిల్ హొల్ గరం మసాలా, ఆనియన్స్, కుంకుమపువ్వు మొదలైనవి..  […]

 Authored By jyothi | The Telugu News | Updated on :12 January 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Mutton Dum Biryani Recipe : ఇంట్లో అందరికీ నచ్చే ఈజీ సూపర్ ఫాస్ట్ మటన్ దమ్ బిర్యాని...!

Mutton Dum Biryani Recipe : ఈరోజు మటన్ దమ్ బిర్యాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్ చాలా సింపుల్. అండ్ ఈజీ అన్నమాట.. పక్కాగా 100% మటన్ బిర్యానీ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది.  దీని తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు: మటన్, బాస్మతి రైస్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, పెరుగు, నిమ్మరసం, ఆయిల్ హొల్ గరం మసాలా, ఆనియన్స్, కుంకుమపువ్వు మొదలైనవి..  తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి.గడ్డలు అనేవి లేకుండా సాఫ్ట్ గా క్రీమీగా బీట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ దాకా పసుపు రెండు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇందులోని రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం, ఒక టేబుల్ స్పూన్ దాక ధనియాల పొడి, ఒక టీ స్పూన్ వేసి అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న మసాలా పేస్ట్ లోకి ఒక కేజీ దాకా మటన్ వేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత ఇందులో మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చుకుని వేసుకోండి. అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేయండి. ఇవన్నీ కూడా బాగా కలపండి. మసాలా అంతా కూడా మటన్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకుని ఈ మటన్ ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్అవెర్ ఇప్పుడు మనం బాస్మతి రైస్ ని నానబెట్టుకుందాం సరిపోతుంది.

రైస్ ని నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి. కుక్కర్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తురుముకున్న ఉల్లి తరుగు మొత్తాన్ని కూడా వేసి నూనెలో బాగా ఫ్రై చేయండి. మంటని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లితరుగు మొత్తం కూడా ఈవెన్ గా వేగేవిధంగా క్రిస్పీగా అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్ లోనే ట్రై చేయండ. వన్స్ ఇలా ఉల్లితరుగు మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్షియల్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రిడియంట్స్ వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని కూడా ఈ నూనెలో వేసేసుకోవాలి. అలాగే మన ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ లోంచి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఇందులో క్రష్ చేసుకుని వేసుకోండి. వీటన్నిటిని కూడా మొత్తం ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ మటన్ ని కుక్కర్ మూతను పెట్టకుండా ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి. ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి. స్టవ్ పై వేరే బౌల్ పెట్టి కొద్దిగా నెయ్యి గాని నూనె గాని వేసుకోండి. ఆయిల్ అనేది లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి హోల్ బిర్యానీ వేయండి ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా చేయించుకుని వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి లైట్ గా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేయండి. మొత్తం అంతా ఒకసారి కలుపుకుని నీళ్లు పోసాక ఇందులోకి ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళని పైకి తేరెలంతవరకు మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి మరిగించండి.

మన నానబెట్టుకున్న రైస్ ని వేసేసుకోవాలి. త్వరగా రైస్ ని కుక్ చేయండి. రైస్ అనేది ఆల్మోస్ట్ 80% కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. మటన్ లో కొంచెం గ్రేవీ అనేది ఉండాలి. అనమాట పూర్తిగా డ్రై గా అయిపోకూడదు. గ్రేవీ గ్రేవీ గా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆపేసేసి పక్కకు దించుకోండి. వ రైస్ కూడా ఉడికిపోయింది.. ఇప్పుడు స్టవ్ మీద బిర్యాని మందంగా ఉండే బిర్యాని పాయింట్ ని పెట్టుకొని అందులో అడుగున ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. తర్వాత మనం కుక్ చేసుకున్న మటన్ మొత్తాన్ని కూడా అడుగున వేసేసి ఈవెన్ గా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలాగే మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా క్రష్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఉడికించిన రైస్ చేసుకుంటూ లేయర్ బై లేయర్ వేసేసేయండి. మొత్తం కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా మటన్ గ్రేవీ ఆ గ్రేవీ మొత్తాన్ని కూడా ఇలా రైస్ మీద పరుచుకోండి. ఇప్పుడు దీనిపైనే రెండు ఎల్లో ఫుడ్ కలర్ని మిక్స్ చేసి యాడ్ చేయండి. నెక్స్ట్ దీని పైన ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని కూడా ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా క్రష్ చేసుకుని వేసేసేయండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ ని తీసుకుని కవర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక అట్ల పెనాన్ని పెట్టి దానిపైన ఈ బిర్యాని పాయింట్ పెట్టి లో ఫ్లేమ్ లో కనీసం 18 నుంచి 20 నిమిషాల పాటు ధామ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో దానం చేస్తే బిర్యానీ అడుగున అసలు మాడకుండా అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. పొడిపొడి లాడుతూ రైస్ అనేది చక్కగా వస్తుంది. 15 టు20 నిమిషాల తర్వాత స్టౌ ఆపేసేయండి. ఇప్పుడు ఈ బిర్యానీ పాట్ ని పక్కకు దించేసుకుని 10 నిమిషాలు అలా వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే గుప్పున గుమగుమలాడే సూపర్ టేస్టీ మటన్ దమ్ బిర్యాని రెడీ అయిపోతుంది..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది