Smart Phones : ఫోన్ లోని కెమెరాలు ఎలా వాడాలి? ఏ కెమెరా దేనికి ఉపయోగపడుతుందో తెలుసా?
Smart Phones : ప్రస్తుత యుగంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే దాని వాడకం అంతలా పెరిగింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే ఏదో ఒక విధంగా ఫోన్‌ను ఉపయోగిస్తూనే ఉంటారు. మొబైల్ అనేది మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. ఇక ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ ఫోన్‌లలో ఒకటి కంటే ఎక్కువ కెమెరాలు ఉంటున్నాయి. రకరకాల లెన్స్ లతో కూడిన మూడు కెమెరాలతో సెటప్ చేసిన ఫోన్లు వస్తున్నాయి. అందులోని లెన్స్ గురించి చాలా మందికి తెలియదు..
ఏ యే సందర్భాల్లో ఏయే కెమెరా వాడాలనే విషయాలు తెలియవు. మరి వాటి గురించి ఓ సారి తెలుసుకుందాం.ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో దాదాపుగా రెండు కెమెరాలు ఉంటున్నాయి. ఎక్కువ ఫోన్లలో మూడు కెమెరాలు ఉండగా, కొన్ని ఫోన్లలో నాలుగు కెమెరాలు సైతం ఉంటున్నాయి. ఇక మొబైల్ కొనే వారిలో చాలా మంది ఎన్ని కమెరాలు ఉన్నయో తెలుసుకుని మరి వాటికి ప్రయారిటీ ఇస్తున్నారు. రకరకాల పరిస్థితుల్లో మొబైల్ ఫొటోగ్రఫీ బాగుండేలా ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. మెయిన్‌గా వైడ్ లెన్స్, అల్ట్రా వైడ్ లెన్స్, మాక్రో లెన్స్, టెలీఫొటో లెన్స్ లు కలిగిన కెమెరాలు స్మార్ట్‌ఫోన్లలో ఉంటాయి.
Smart Phones : ఎలా వాడాలి..
వైడ్ యాంగిల్ లెన్స్.. ఇది ప్రధాన కెమెరా. సాధారణ ఫొటోలకు ఈ కెమెరానే వాడుతుంటాం. ఫ్రంట్ కెమెరా కూడా వైడ్ యాంగిల్ లెన్స్‌తోనే ఉంటాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్.. ఫొటోలో ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. టెలిఫొటో లెన్స్.. దూరంగా ఉన్న వాటిని మెరుగ్గా ఫొటో తీసేందుకు ఇవి ఉపయోగపడతాయి. మాక్రో లెన్స్.. అత్యంత దగ్గరి నుంచి డిటైల్స్ తో సహా ఫొటో తీసేందుకు ఈ లెన్స్ ఉపయోగపడతాయి.