Revanth Reddy : రేవంత్ రెడ్డి రాజీవ్ భరోసా యాత్రకు విశేష స్పందన వస్తున్నా హైకమాండ్ నుంచి స్పందన లేదెందుకు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : రేవంత్ రెడ్డి రాజీవ్ భరోసా యాత్రకు విశేష స్పందన వస్తున్నా హైకమాండ్ నుంచి స్పందన లేదెందుకు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 February 2021,10:57 am

Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఊపు మీదున్నారు. రేవంత్ ప్రస్తుతం రాజీవ్ భరోసా యాత్రను తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఆ యాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా మాంచి జోష్ లో ఉన్నారు.

huge response to revanth reddy rajeev bharosa yatra

huge response to revanth reddy rajeev bharosa yatra

కాంగ్రెస్ పార్టీకి గట్టెక్కించడానికి.. వచ్చే ఎన్నికల్లో గెలిపించడానికి రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ కు చెందిన మిగితా నేతలు పెద్దగా పట్టించుకోకున్నా.. రేవంత్ రెడ్డి మాత్రం తనదైన శైలితో దూసుకుపోతున్నారు. తనకంటూ ఓ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంటున్నారు. నిజానికి.. రేవంత్ రెడ్డికి తెలంగాణలో బాగానే పాపులారిటీ ఉంది. అందుకే.. తన పాపులారిటీని ఉపయోగించుకొని పార్టీని పటిష్ఠ పరచడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు రేవంత్ రెడ్డి.

ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్షలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. రైతులు, కాంగ్రెస్ నాయకుల కోరిక మేరకు.. అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. వెంటనే అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభించారు.

Revanth Reddy : హైకమాండ్ సమ్మతి లేకుండా పాదయాత్ర ఎలా చేస్తారు?

అయితే.. పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు సీనియర్ నేతలు.. రేవంత్ తీరుతో అసహనానికి గురవుతున్నారట. ఆయన ఇష్టమేనా? ఆయనకు నచ్చితే పాదయాత్ర చేస్తారా? అధిష్ఠానం సమ్మతి కోరరా? అధిష్ఠానం పర్మిషన్ లేకుండా అలా ఎలా పాదయాత్ర చేస్తారు.. అని అసహసం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి పాదయాత్రకు అధిష్ఠానం నుంచి ఎటువంటి అనుమతి లేదని.. అందుకే.. కొందరు నాయకులు రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనలేదట. రేవంత్ రెడ్డి అనుచరులు మాత్రమే ఈ పాదయాత్రలో పాల్గొన్నారట. ఒకవేళ పాదయాత్రకు వెళితే.. హైకమాండ్ నుంచి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని.. కొందరు నేతలైతే సైలెంట్ అయిపోయారట.

ఏది ఏమైనా.. రేవంత్ రెడ్డి.. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాల్సింది పోయి.. హైకమాండ్ పర్మిషన్ లేదు గిర్మిషన్ లేదు అంటూ కొందరు నేతలు ప్రవర్తిస్తున్న తీరుతో రేవంత్ రెడ్డికి కూడా విసుగు వచ్చేసిందట. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది