Telangana : తెలంగాణలో రాబోయేది హంగ్ అసెంబ్లీ..??
Telangana : ఇంకొన్ని నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ తప్పదా అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. తెలంగాణలో ఉన్న పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఏ పార్టీ కూడా తమదే విజయం అన్న రేంజ్ లో ఉన్నాయి. మూడు పార్టీలు తమదే విజయం అంటూ విర్రవీగుతున్నాయి. కానీ.. బయట పరిస్థితులు చూస్తే మాత్రం అలా లేవు. గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే అసలు ఏ పార్టీకి కూడా అధికారంలోకి వచ్చేంత సీన్ లేదంటున్నారు.
మరి.. ఇలాంటి సందర్భంలో అసలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు.నిజానికి.. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా గెలవడం కష్టమేనట. దానికి సంపూర్ణ మెజారిటీ రాదట. 119 నియోజకవర్గాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సింది 60 సీట్లు. అదే మ్యాజిక్ ఫిగర్. 60 సీట్లు సంపాదిస్తే ఇక ఆ పార్టీకి తిరుగు ఉండదు. కానీ.. 60 సీట్లు సంపాదించే సత్తా ప్రస్తుతం ఏ పార్టీకి లేదని సర్వేలు చెబుతున్నాయి.
Telangana : కేసీఆర్ పాలనపై జనాల్లో వ్యతిరేకత వచ్చేసిందా?
నిజానికి.. సీఎం కేసీఆర్ పాలనపై జనాల్లోనూ వ్యతిరేకత వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. అందుకే.. హంగ్ అసెంబ్లీకే ఎక్కువ చాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అటూ ఇటూ అన్నట్టుగా ఉంది. సంపూర్ణ మెజారిటీ దక్కడం ఏ పార్టీకి సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో రెండు మూడు పార్టీలు కలిసి తెలంగాణలో అధికారాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం మరి.. తెలంగాణలో అసలు గెలుపు ఎవరి వశం అవుతుందో?