Illicit Relationship : ఎక్కడ భర్తకు అక్రమ సంబంధం తెలుస్తుందో అని భార్య ఏంచేసిందో తెలుసా…?
Illicit Relationship : దక్షిణ ఢిల్లీలో ఒక మహిళ తన రహస్య సంబంధాన్ని భర్తకు తెలియకుండా దాచేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు వార్తల్లో నిలిచేలా చేసింది. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో నర్సుగా పని చేసే 25 ఏళ్ల వివాహిత.. హాస్పటల్ లో మరో వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకుంది. గత కొద్దీ రోజులుగా ఈ యవ్వారం నడుపుతుంది. రోజు భార్య ఆలస్యంగా ఇంటికి వస్తుండడం తో భర్త కు అనుమానం మొదలైంది. అసలు ఏంజరుగుతుందో తెలుసుకోవాలని మాటు వేసాడు. భార్య మరో వ్యక్తి తో గడుపుతున్న విషయం తెలిసి షాక్ అయ్యాడు. ఇంటికి వచ్చిన భార్యను మందలించాడు. భార్య కు తెలియకుండా ఆమె ఫోనే లో ఉన్న ప్రవైట్ ఫొటోస్ ను తన ఫోనే లోకి ఎక్కించుకున్నాడు.
ఈ విషయం ఆమెకు తెలియడం తో భర్త ఫోన్‌లో ఉన్న ప్రైవేట్ ఫొటోలు డిలీట్ చేయాలన్న ఉద్దేశంతో తన ప్రియుడి సహకారంతో భర్త ఫోన్ దొంగతనం చేయించింది. జూన్ 19న సుల్తాన్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో ఫతేపూర్ బేరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సుమారు 70కి పైగా సీసీటీవీ ఫుటేజ్, స్కూటర్ నంబర్, ఆధార్ ఆధారంగా నిందితులను గుర్తించారు. స్కూటర్‌ను ఒకరోజు మాత్రమే అద్దెకు తీసుకున్నట్టు తేలడంతో, అద్దె ప్రక్రియలో ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితుడు అంకిత్ గహ్లోత్‌ను రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు.
Illicit Relationship : ఎక్కడ భర్తకు అక్రమ సంబంధం తెలుస్తుందో అని భార్య ఏంచేసిందో తెలుసా…?
అతని దగ్గర దొంగిలించిన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, వివాహిత తన ప్రియుడితో కలిసి కుట్ర పన్ని భర్త ఫోన్‌ను దొంగిలించిందని వెల్లడైంది. ఫోన్ డేటా డిలీట్ చేసిన తర్వాత, ఫోన్‌ను అంకిత్‌కు అప్పగించినట్టు తెలిసింది. ఈ కేసులో భార్యను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోయినా, “బౌండ్ డౌన్” చేసి పోలీసుల అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకుండా అదేశించారు. ఆమె ప్రియుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ సంఘటన ఒక వ్యక్తిగత సంబంధం, ఎలా నేరపూరిత కుట్రగా మారుతుందో, ఆత్మరక్షణ పేరుతో తప్పుడు మార్గాలు ఎంచుకుంటే చివరికి అది మోసంగా ఎలా మారుతుందో స్పష్టంగా చూపిస్తోంది.