Huzurabad bypoll : హుజూరాబాద్ ఉపఎన్నికే లక్ష్యంగా.. టీఆర్ఎస్, బీజేపీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్న కాంగ్రెస్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Huzurabad bypoll : హుజూరాబాద్ ఉపఎన్నికే లక్ష్యంగా.. టీఆర్ఎస్, బీజేపీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్న కాంగ్రెస్?

 Authored By sukanya | The Telugu News | Updated on :3 September 2021,7:00 am

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ ఎలా ఉండనుందన్న అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇక్కడ ప్రధాన పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కాంగ్రెస్ కూడా ఇక్కడ ఈ రెండు పక్షాలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. త్వరలోనే తమ అభ్యర్థిని ప్రకటించి హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం పర్వంలోకి దిగాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇదిలా ఉంటే మిగతా చిన్న పార్టీలు ఇక్కడి నుంచి పోటీ చేస్తాయా ? అనే చర్చ కొంతకాలంగా సాగుతోంది. అయితే తాజాగా హుజూరాబాద్‌లో పోటీ చేసే అంశంపై సీపీఐ పార్టీ క్లారిటీ ఇచ్చింది.

congress party

congress party

హుజూరాబాద్‌లో త్వరలో జరుగబోయే ఉపఎన్నికలో సీపీఐ పోటీ చేయదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీకి మద్దతు ఇచ్చే విషయాన్ని త్వరలో రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో చర్చించి, నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సీపీఐ పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపిస్తుందని ఎవరూ ఊహించలేరు. ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉన్న కారణంగానే.. ఇక్కడ పోటీలో ఉండకూడదని సీపీఐ భావించి ఉండొచ్చనే చర్చ కూడా సాగుతోంది. అయితే మరో పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.

టీఆర్ఎస్ కే లాభమా.. Huzurabad bypoll 

బీజేపీకి సీపీఐ ఎలాగూ మద్దతు ఇవ్వదు కాబట్టి.. బరిలో ఉన్న మరో రెండు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీకి సీపీఐ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ వస్తున్న సీపీఐ.. ఈ రెండు పార్టీల్లో ఎవరికి మద్దతు ఇస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్.. ఈ ఎన్నిక కోసం సీపీఐ మద్దతు తీసుకునే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది.

all parties new plan on Huzurabad by poll

all parties new plan on Huzurabad by poll

మరోవైపు టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చే విషయంలో సీపీఐ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని.. అందుకే ఈ రకమైన ప్రకటన చేసి ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. గతంలో పలు ఉప ఎన్నికల సందర్భంగా సీపీఐ టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ సీపీఐ ఇలాంటి ప్రకటన చేసిందని.. చివరకు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉండిపోయిందని గుర్తు చేసుకుంటున్నారు. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సీపీఐ మద్దతు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ తెర వెనుక మంతనాలు చేపట్టే అవకాశం లేకపోలేదని చర్చ రాజకీయవర్గాల్లో బలంగా సాగుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది