kaushik reddy : కౌశిక్ రెడ్డి రాజీనామాతో రంజుగా మారిన హుజురాబాద్ రాజకీయం..!
kaushik reddy హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ.. కౌశిక్ రెడ్డి kaushik reddy కాంగ్రెస్ congress పార్టీకి రాజీనామా చేసారు. కౌశిక్ రెడ్డి ఒక కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి తనకు టీఆర్ఎస్ టిక్కెట్ ఖరారైందని..తానే అధికార పార్టీ నుంచి హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. యవకుల మద్దతు కూడగట్టాలని…డబ్బుల సంగతి తానే చూసుకుంటానంటూ హామీ ఇచ్చారు. ఈ ఆడియో లీక్ కావటంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి Revanth reddy సీరియస్ అయ్యారు. దీంతో..ఈ మొత్తం వ్యవహారం పైన కౌశిక్ రెడ్డి kaushik reddy కి నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణా సంఘానికి సూచించారు. ఆ వెంటనే కౌశిక్ రెడ్డి kaushik reddy కి నోటీసులు జారీ అయ్యాయి. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని అందులో సూచించారు. కౌశిక్‌రెడ్డి kaushik reddy ని సస్పెండ్ చేయాలంటూ హుజురాబాద్‌లో డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ తీర్మానం చేశారు. ఈ మేరకు హుజురాబాద్ ఇన్‌ఛార్జ్ దామోదర రాజనర్సింహకి లేఖ రాశారు.

huzurabad kaushik reddy resigned to congress party
టీ కాంగ్రెస్ నోటీసు జారీ.. kaushik reddy
ఇదే సమయంలో తనకు నోటీసులు జారీ కావటంతో కౌశిక్ రెడ్డి తన సన్నిహితులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పంపారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ ఫంక్షన్ లో ఆయన కేటిఆర్ ను కలిసిన వీడియోలు వైరల్ గా మారాయి. పాడి కౌశిక్ రెడ్డి కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ TRS నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు అందాయి. గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించిందని తెలుస్తోంది. అయినా కౌశిక్ రెడ్డి తీరు మారకపోవడంతో సస్పెండ్ చేసే యోచనలో పీసీసీ ఉందని తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి పార్టీలో చేరితే టికెట్ ఇస్తామని గులాబీ పెద్దలు హామీ ఇచ్చారని భావిస్తున్నారు. అయితే, రెడ్డి వర్గానికి ఇవ్వాలా …లేక బీసీ వర్గానికి చెందిన వారినే బరిలోకి దింపాలా అనే దానిపై హుజూరాబాద్ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు.

congress party
త్వరలో కారెక్కనున్న కౌశిక్ రెడ్డి .. kaushik reddy
దీంతో..కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ నుండి గులాబీ పార్టీ టిక్కెట్ ఖాయమనే ప్రచారం సాగుతున్నా..నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాలు..బలా బలాలు ఆధారంగా సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ తరువాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కౌశిక్ రెడ్డి ముందుగానే టీఆర్ఎస్ లో చేరటం ద్వారా తన సీటుకు మరింత మద్దతు పెంచుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు.

trs party
దీంతో.. కౌశిక్ రెడ్డి ఈ నెల 16న గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం. కౌశిక్ రెడ్డి తన భవిష్యత్ అడుగుల గురించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ తో హుజురాబాద్ రాజకీయాలు రంజుగా మారాయి. ఇక కౌశిక్ రెడ్డి కారు ఎక్కడమే మిగిలిందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డి రాజీనామాతో .. టీ కాంగ్రెస్ ఏం చేస్తుందన్నదే చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి ==> నెక్స్ ట్ హరీష్ రావేనా… ఫోకస్ పెంచిన కేసీఆర్… ఆ ఎన్నిక ముగియగానే..?
ఇది కూడా చదవండి ==> TRS : పదవి ఇస్తారా..? వేరే పార్టీలోకి వెళ్లాలా..? అధిష్ఠానానికి అసంతృప్త నేతల సవాల్..?
ఇది కూడా చదవండి ==> Huzurabad : పాదయాత్రలకు పార్టీలు రెడీ.. హుజూరాబాద్ గెలుపును పాదయాత్రలు డిసైడ్ చేస్తాయా?