Huzurabad Result : ఆరో రౌండ్ ముగిసే సరికి ఆధిక్యంలో కమలం..
Huzurabad Result : హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ జరుగుతోంది. తొలి మూడు రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన బీజేపీ మలి మూడు రౌండ్లలలోనూ ముందంజలో ఉంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఆఫీసర్స్ కౌంటింగ్ స్టార్ట్ చేశారు. నాల్గో రౌండ్‌లో బీజేపీకి 17,969, టీఆర్ఎస్‌కు 16,144, కాంగ్రెస్‌కు 680 ఓట్లు వచ్చాయి.
ఐదో రౌండ్‌లోనూ బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్‌లో 2,169 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బీజేపీకి 22,367 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 20,158 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్‌లోనూ బీజేపీ 3,186 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.మొత్తంగా ఈ రౌండ్ టు రౌండ్ ఫలితాలు తెలుసుకుని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయ.

huzurabad result 6th round lead BJP
ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరో వైపున హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులోనూ సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆఫీసుకు బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ ఇంకా ఇతర నేతలు చేరుకున్నారు.