Categories: News

Crime News | మేడిపల్లిలో అమానుష ఘటన..గర్భవతిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసిన భర్త

Crime News | హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి ప్రాంతంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బాలాజీ హిల్స్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి తన గర్భవతి భార్యను హత్య చేసి, మృతదేహాన్ని ముక్క‌లు ముక్కుల‌గా నరికిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (25), మహేందర్ అనే యువకుడిని ప్రేమించి కొంతకాలం క్రితం పెళ్లి చేసుకుంది.

మ‌రీ ఇంత దారుణ‌మా?

వివాహం అనంతరం ఈ దంపతులు బోడుప్పల్ ప్రాంతంలోని బాలాజీ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. తరచూ గొడవలు జరుగుతుండగా, చివరకు మహేందర్ తన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం… శనివారం మధ్యాహ్నం మహేందర్ తన భార్య స్వాతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు.

తల, చేతులు, కాళ్లను వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. ఛాతీ భాగాన్ని కవర్‌లో పెట్టి గదిలోనే దాచినట్లు గుర్తించారు. మేడిపల్లి పోలీసులు స‌మాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన భార్యను హత్య చేసిన విషయాన్ని మహేందర్ అంగీకరించాడు. హత్యకు గల కారణంగా కుటుంబ సమస్యలేనా, కట్న వేధింపులా లేక మరేదైనా వ్యక్తిగత కారణమా అన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. మృతదేహం మిగతా భాగాల కోసం గాలింపు కొనసాగుతోంది.

Recent Posts

Heart Attack | గుండెపోటు వచ్చే ముందు ఈ సంకేతాలు క‌నిపిస్తాయ‌ట‌.. అస్సలు నిర్ల‌క్ష్యం చేయోద్దు..

Heart Attack | ఇటీవల కాలంలో గుండెపోటు సమస్యలు వృద్ధులతో పాటు యువతలోనూ తీవ్రమవుతున్నాయి. తక్కువ వయస్సులోనే అనేకమంది గుండెపోటు బారినపడి…

44 minutes ago

Moong Vs Masoor Dal | పెసరపప్పు-ఎర్రపప్పు.. ఈ రెండింట్లో ఏది ఆరోగ్యానికి మంచిది..?

Moong Vs Masoor Dal | భారతీయ వంటకాల్లో పప్పు ధాన్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉండటంతోపాటు…

2 hours ago

Health Tips | సన్‌స్క్రీన్ వాడిన వారికి విట‌మిన్ డి లోపం వ‌స్తుందా.. నిపుణుల స‌మాధానం ఏంటంటే..!

Health Tips | చర్మాన్ని సూర్యకిరణాల నుండి కాపాడేందుకు సన్‌స్క్రీన్‌ను ప్రతి రోజు వాడాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.…

3 hours ago

Health Tips | కొబ్బ‌రి నీళ్లు, నిమ్మ‌కాయ ర‌సం..ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

Health Tips | కాలానికి అతీతంగా ఆరోగ్యాన్ని బలోపేతం చేసే పానీయాల గురించి మాట్లాడుకుంటే కొబ్బరి నీరు మరియు నిమ్మకాయ…

4 hours ago

vinayaka chavithi | వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఇంట్లోనే స్పెష‌ల్‌గా చేసుకునే మోదకాలు ఏవి?

vinayaka chavithi| వినాయక చవితి సందర్భంగా మోదకాలను ఇంట్లో తయారుచేసి శ్రీ గ‌ణేశుడికి నివేదించ‌డం జ‌రుగుతుంది… అలా చేస్తే రుచి,…

5 hours ago

Credit Cards : ఇలా క్రెడిట్ కార్డ్స్ తో షాపింగ్ చేస్తే మీకు ఫుల్ గా డబ్బులు సేవ్ అవుతాయి..!!

Credit Card Using : పండుగల సందర్భంగా, లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో జరిగే సేల్స్‌లో చాలా…

14 hours ago

TCS Layoffs : లేఆఫ్ ఉద్యోగులకు టీసీఎస్ ఊపిరి పీల్చుకునే శుభవార్త

TCS Good News : భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల దాదాపు 12 వేల…

15 hours ago

Credit Card Fraud : క్రెడిట్ కార్డు మోసాలు బారినపడకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే !!

Credit Card : ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులను…

16 hours ago