Hyderabad Rain : గుబులు పుట్టిస్తున్న గులాబ్ తుఫాన్.. హైదరాబాద్ జాగ్రత్త..!
Hyderabad Rain : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుపానుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారులు హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 3 గంటల నుంచి సాయంత్రం వరకు 4 సెంటిమీటర్ల వర్షం పడినట్టు అధికారులు తెలిపారు.
ఇంకా భారీ వర్షం పడుతుందని మంగళవారం ఉదయం వరకు కూడా భారీ వర్షం పడొచ్చని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆఫీసులో అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను వెంటనే కంట్రలో చేసేందుకుగాను మాన్ సూన్ టీమ్స్, డీఆర్ఎఫ్ టీమ్స్‌ను రెడీగా ఉంచారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మూసాపేట్, జీడిమెట్ల, చింతల్, గాజులరామారం, హయత్ నగర్, మల్కాజ్‌గిరి, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో 3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో 3 సెంటిమీటర్లకు పైగా వర్షం నమోదైంది. ఇకపోతే వాతావరణ శాఖ అధికారులు ఆల్రెడీ హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగానూ వర్షాలు కురుస్తున్నాయి.