Hyper Aadi : పూర్తిగా బండ్లన్నగా మారిన హైపర్ ఆది… పవన్ కళ్యాణ్ అనుగ్రహం లభించినట్లే నా..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 January 2023,7:40 pm

Hyper Aadi : బండ్ల గణేష్ స్టేజ్‌ ఎక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అది పవన్ కళ్యాణ్ సినిమా కు సంబంధించిన ఈవెంట్ అయితే బండ్ల గణేష్ మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరిని కట్టి పడేస్తాయి. బండ్ల గణేష్ భలే మాట్లాడుతాడు. ఆయన మనసులోని వచ్చే ప్రతి మాటను బయటకు అలా అలా చెప్తూ అందరిని ఆకట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ ని ఒక దేవుడు అంటూ కీర్తిస్తూ బండ్ల గణేష్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ కొన్ని కారణాల వల్ల పవన్ కాంపౌండ్ నుండి సైడ్ అయిపోయినట్లుగా అనిపిస్తున్నాడు. దాంతో బండ్ల గణేష్ ప్లేస్ లో హైపర్ ఆది వచ్చి చేరినట్లుగా ఉన్నాడు.

తాజాగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జనసేన బహిరంగ సభలో హైపర్ ఆది మాట్లాడుతూ బండ్ల గణేష్ ని తలపించాడు. పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ తనదైన శైలి పంచ్‌ డైలాగులతో జనసేన యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ హైపర్ ఆది మాట్లాడిన మాటలు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు ఉత్సాహాన్ని నింపాయి. పవన్ కళ్యాణ్ ఒక గొప్ప వ్యక్తి అంటూ హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒకవైపు బుల్లితెర,

hyper aadi comments on pawan kalyan in janasena meeting

hyper aadi comments on pawan kalyan in janasena meeting

మరో వైపు వెండి తెర పై సందడి చేస్తూనే హైపర్ ఆది ఇలా జనసేన సభలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాబోయే ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా.. అందుకే పవన్ కళ్యాణ్ అనుగ్రహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడా అంటూ సినీ మరియు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీ నుండి జనసేన పవన్ కళ్యాణ్ కి కేవలం హైపర్ ఆది నుండి మాత్రమే మద్దతు లభించింది. హైపర్ ఆది కచ్చితంగా ఒక పాపులారిటీ స్టార్ కమెడియన్.. అలాంటి స్టార్ జనసేనకు మద్దతుగా ఉండటం కచ్చితంగా ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి